డయాబెటీస్ పేషెంట్లు ఉదయాన్నే ఏం తాగాలి?

First Published | Dec 24, 2023, 7:15 AM IST

డయాబెటీస్ పేషెంట్లు ఏది పడితే అది తినకూడదు. ఎందుకంటే కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతాయి. అయితే మధుమేహులు  ఉదయాన్నే కొన్ని ఆహారాలను తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 

diabetes

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చెడు ఆహారాలు, మారుతున్న జీవనశైలే డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణాలంటారు నిపుణులు. ఏదేమైనా డయాబెటిస్ వచ్చిందంటే.. ఇక తగ్గే ప్రసక్తే ఉండదు. దీన్ని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అందుకే షుగర్ పేషెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్లు తమ జీవనశైలిని మెరుగ్గా ఉంచుకోవాలి. అలాగే ఏవి పడితే అవి తినకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి లేదా తగ్గించడానికి మధుమేహులు కొన్ని ఆహారాలను మొత్తమే తినకుండ ఉండాలి. లేదా తగ్గించాలి. మరి డయాబెటీస్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉదయం ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బొప్పాయి జ్యూస్ 

డయాబెటిస్ పేషెంట్లు బొప్పాయి జ్యూస్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిజానికి ఇది డయాబెటీస్ పేషెంట్లకు ఆరోగ్యకరమైన పానీయం. దీనిని వీళ్లు ఉదయాన్నే తాగొచ్చు. ఈ జ్యూస్ ను వీలైనంత వరకు ఖాళీ కడుపుతోనే తాగాలి. ఇది షుగర్ లెవెల్స్ ను బాగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ లో తక్కువ మొత్తంలో కొవ్వు, పిండి పదార్థాలు, కేలరీలు ఉంటాయి. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి.


Fenugreek Water

మెంతివాటర్

డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే మెంతి వాటర్ ను తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఈ వాటర్ షుగర్ ను కంట్రోల్  చేస్తుంది. ఇందుకోసం మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి  ఉదయాన్నే వడపోసి తాగాలి. ఈ మెంతివాటర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటుగా ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. 
 

దాల్చిన చెక్కతో గ్రీన్ టీ

దాల్చిన చెక్కతో కూడిన గ్రీన్ టీ కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఉదయాన్నే తాగడం మంచిది. ఇది షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు స్వీట్లకు దూరంగా ఉన్నప్పుడు..దాల్చినచెక్కను ప్రత్యామ్నాయంగా ఉపయోగించొచ్చు. దాల్చిన చెక్కలోని తీపి ఉపయోగపడుతుంది. టీ, ఇతర ప్రయోజనాల కోసం దాల్చినచెక్కను ఉపయోగించేవారు చాలా మందే ఉన్నారు. దాల్చిన చెక్క చక్కెరను తగ్గించడమే కాకుండా డయాబెటిస్ తో సంబంధం ఉన్న ఎన్నో ఆరోగ్య సమస్యలను, వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. వీటితో పాటు గ్రీన్ టీ ప్రయోజనాలను కూడా పొందుతారు. 

Latest Videos

click me!