ఈ పండ్లను పరిగడుపున తింటే ఎంత మంచిదో..!

First Published | Dec 23, 2023, 7:30 AM IST

పండ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. అయితే కొన్ని రకాల పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. ముఖ్యంగా ఉదయం. అయితే కొన్ని రకాల పండ్లను ఉదయం పరిగడుపునే తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అవి ఏయే పండ్లంటే..

మనం తినే ఆహారమే మన ఆరోగ్యం ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. అయితే ఫుడ్ ను తినడానికి ఒక నిర్ధిష్ట సమయం ఉంటుంది. అలాగే వాటిని ఎలా తినాలి? ఎలా తినకూడదు అనే నియమాలు కూడా ఉంటాయి. అయితే ఉదయాన్నే కొన్నిరకాల పండ్లను పరగడుపున తినడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్లు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. ఇంతకీ ఆ పండ్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పుచ్చకాయ

పుచ్చకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఉదయాన్నే పుచ్చకాయ పండును తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన ద్రవాలు అందుతాయి. అలాగే డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం తగ్గుతుంది. విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పుచ్చకాయ శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 

Latest Videos


papaya

బొప్పాయి

బొప్పాయి పండును కూడా ఉదయం పరిగడుపున తినొచ్చు. ఉదయాన్నే పరిగడుపున బొప్పాయి పండును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీన్ని తింటే మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే బొప్పాయిని డైట్ లో చేర్చుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండులో  కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
 

ఆపిల్

ఆపిల్ పండును కూడా మార్నింగ్ పరిగడుపునే తినొచ్చు. ఫైబర్, సహజ  చక్కెరలు పుష్కలంగా ఉండే ఆపిల్ పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఈ పండు మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. 
 

కివీ

కివీ పండ్లు విటమిన్ సి కి అద్బుతమైన వనరులు. ఈ పండ్లను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయాన్నే పరగడుపున కివీలను తినడం వల్ల కూడా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

click me!