పోషకాలు పుష్కలంగా ఉండే గింజల్లో బాదం పప్పులు ఒక్కటి. వీటిలో గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, ప్రోటీన్లు, డైటరీ ఫైబర్ మెండుగా ఉంటాయి. అలాగే వీటిలో ఉండే విటమిన్ ఎ, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్స్ వంటి ముఖ్యమైన పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. చలికాలంలో వీటిని తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఇతర ఆహారాల మాదిరిగానే బాదం పప్పులను కూడా మరీ ఎక్కువగా తినడం మంచిది కాదు. ఎందుకంటే బాదం పప్పులను ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.