బరువు తగ్గడానికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..

First Published | Dec 18, 2023, 7:15 AM IST

బరువు తగ్గడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటుగా తక్కువ కేలరీలున్న ఆహారాన్ని తీసుకోవడం కూడా ముఖ్యమే. అయితే చాలా మంది బరువు తగ్గడానికని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేసేస్తుంటారు. కానీ శరీరం ఫిట్ గా ఉండటానికి బ్రేక్ ఫాస్ట్ చాలా చాలా అవసరం. మీరు బరువు తగ్గడానికి బ్రేక్ ఫాస్ట్ ను మానేయక్కర్లేదు. అయితే కొన్ని ఆహారాలు ఉదయం తింటే సులువుగా బరువు తగ్గుతారు. అవేంటంటే? 

breakfast

శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండాలి. అయితే మనలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే బరువు తగ్గుతారని బ్రమపడిపోతుంటారు. కానీ ఇది మీరు మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది. ఎలా అంటే ఉదయం ఏమీ తినకపోవడంతో బాగా ఆకలిమీదుంటారు. దీనివల్ల మధ్యాహ్నం హెవీగా తింటారు. అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను అస్సలు స్కిప్ చేయకూడదు. మరి బరువు తగ్గాలనుకున్న వారు ఉదయం ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ ను తినాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఉప్మా..

సౌత్ ఇండియాలో పాపులర్ బ్రేక్ ఫాస్ట్ ఉప్మా. రవ్వ, కూరగాయలతో ఉప్మాను టేస్టీగా తయారుచేసుకోవచ్చు. కానీ దీన్ని చాలా మంది తినరు. కానీ దీన్ని తింటే మీరు ఎంచక్కా బరువు తగ్గుతారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఉప్మా మంచి బ్రేక్ ఫాస్ట్. 
 

Latest Videos


Poha

పోహా

మహారాష్ట్ర వంటకాల్లో ఒకటైన పోహాలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిని బియ్యంతో తయారు చేస్తారు. అలాగే దీనిలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, వేరుశెనగలను వేసి ఎంతో టేస్టీగా వండుతారు. ఇది కూడా మీరు బరువు పెరగకుండా చేస్తుంది. 

ఇడ్లీ

రవ్వ, బియ్యం, పప్పులతో చేసిన ఇడ్లీ దక్షిణ భారతదేశంలో చాలా మందికి ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్. మీడియం సైజు ఇడ్లీలో కేవలం 39 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇదికూడా మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. 

మూంగ్ చిల్లా

ఈ వంటకాన్ని పెసరపప్పుతో తయారుచేస్తారు. దీన్ని తయారు చేయడానికి మీకు ఇష్టమైన కూరగాయలను ఉపయోగించొచ్చు. దీన్ని కూడా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినొచ్చు. ఇది కూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

వోట్మీల్

ఇది ఎంతో ఆరోగ్యకరమైన అల్పాహారం. దీన్ని చేయడానికి మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. దీన్ని పప్పు, కూరగాయలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ఇది మీరు ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన ఎన్నో రకాల పోషకాలను కూడా అందిస్తుంది. బరువు తగ్గడానికి ఇది గొప్ప అల్పాహారం.

click me!