వీటిని తింటూ నీళ్లను మరీ ఎక్కువగా తాగేయకండి.. సమస్యలొచ్చేస్తయ్

First Published | Dec 17, 2023, 4:34 PM IST

ఆయిలీ, స్పైసీగా ఉండే ఆహారాలను తింటుంటే నీళ్లను మరీ ఎక్కువగా తాగుతుంటాం. కానీ ఇలా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. 
 

కొంతమంది నీళ్లను తాగకుండా ఒక్క బుక్క కూడా తినలేరు. కానీ తినేటప్పుడు నీళ్లను తాగకూడదు. అయితే అవసరమైతే కొన్ని తాగొచ్చు. కానీ కొంతమంది తింటూనే నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు. తిన్న వెంటనే నీళ్లను ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. నీళ్లను ఎప్పుడైనా తినడానికి గంట ముందే తాగాలని ఆరోగ్య నిపుణులు చెప్తారు. తినే సమయంలో లేదా తిన్న వెంటనే ఎక్కువ నీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏ ఆహారాలు తిన్న తర్వాత నీళ్లను ఎక్కువగా తాగకూదదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్ తిన్న వెంటనే చాలా మంది నీళ్లను ఎక్కువగా తాగేస్తుంటారు. కానీ ఇలాచేయడం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే స్పైసీ ఫుడ్స్ తిని వెంటనే నీళ్లను తాగడం వల్ల నోటి చికాకు కలుగుతుంది. అలాగే నోటి వాపు సమస్య వస్తుంది. 


ఆయిల్ ఫుడ్స్

ఆయిల్ ఫుడ్స్ ను తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఎందుకంటే ఇది మీ కడుపులో బరువు, ఉబ్బరం సమస్యలను కలిగిస్తుంది. అందుకే వీటిని తిన్న 30 నిమిషాల తర్వాతే నీళ్లను తాగండి. ఎలాంటి సమస్యలు రావు.

drink water

కార్బోనేటేడ్ పానీయాలు

కొంతమంది ఫుడ్ తిన్న వెంటనే కార్బోనేటేడ్ వాటర్ లేదా సోడా తాగడానికి ఇష్టపడతారు. వీటిని తాగడం వల్ల కొంతమందికి ఉబ్బరం, గ్యాస్  వంటి సమస్యలు వస్తాయి. ఇది అజీర్ణానికి కూడా కారణమవుతుంది.
 

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు అయిన నారింజ, ద్రాక్ష, నిమ్మకాయల్లో విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి జ్యూసీగా ఉంటాయి. అలాగే వాటర్ కంటెంట్ ను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ పండ్లు తిన్న వెంటనే ఎక్కువ మొత్తంలో నీటిని తాగితే మీకు జీర్ణ సమస్యలు వస్తాయి.
 

పెరుగు

పెరుగులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇది జీర్ణక్రియకు ఎంతో ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రోబయోటిక్స్ తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల అవి నాశనం అవుతాయి. 
 

అన్నం

అన్నం తిన్న వెంటనే నీళ్లను ఎక్కువ మొత్తంలో తాగడం జీర్ణక్రియకు మంచిది కాదు. అన్నం తినడానికి ముందు ఒక గ్లాసు నీరు నీటిని తాగితే మంచిది. అన్నం తిన్న వెంటనే నీళ్లను ఎక్కువగా తాగడం మానుకోండి. అన్నం తిన్న అరగంట తర్వాత మాత్రమే నీళ్లను తాగండి. అన్నం జీర్ణం కావడానికి కొంత సమయం లభించడంతో పాటు కడుపులో భారంగా కూడా అనిపించదు.
 

Latest Videos

click me!