చలికాలంలో నల్లమిరియాలను తప్పక తినాలి.. ఎందుకంటే?

First Published | Dec 16, 2023, 4:34 PM IST

మనం తరచుగా ఉపయోగించే మసాలా దినుసుల్లో నల్లమిరియాలు ఒకటి. వీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. వీటిని చలికాలంలో మన ఆహారంలో చేర్చుకుంటే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం. 
 

చలికాలంలో మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్ లో మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ముఖ్యంగా ఈ చలికాలంలో మన రోజువారి ఆహారంలో నల్లమిరియాలను చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. నల్లమిరియాల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. 

విటమిన్ సి పుష్కలంగా ఉండే నల్ల మిరియాలు చలికాలంలో దగ్గు, జలుబు,  ఉబ్బసం లక్షణాలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఈ నల్లమిరియాలను తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నల్ల మిరియాలలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయి. మిరియాలు సంక్రమణను నివారించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 


నల్ల మిరియాలు దగ్గుతో పాటుగా శ్వాసకోశ లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సాధారణ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. నల్ల మిరియాలలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, సోడియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటాయి. 
 

నల్ల మిరియాల్లో పైపెరిన్ అని పిలువబడే బయోయాక్టివ్ సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది నల్ల మిరియాలకు ప్రత్యేకమైన రుచి, ప్రయోజనాలను ఇస్తుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే నల్ల మిరియాలను మన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు గ్యాస్, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. 

నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. ఇవి సయాటికాను నివారించడానికి సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారు కూడా బ్లాక్ పెప్పర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. దీనిలో ఉండే పైపెరిన్ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కూడా బ్లాక్ పెప్పర్ ను తీసుకోవచ్చు. 

Latest Videos

click me!