గోధుమ పిండి రొట్టె రుచి బాగుండేలా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
1. వాము: వాము జీర్ణక్రియకు సహాయపడుతుంది, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రొట్టె తింటే చాలా మందికి కడుపులో సమస్యలు వస్తాయి. వామును వేయించి పిండిలో కలిపి రొట్టె చేసి చూడండి. రుచి, వాసన బాగుండటమే కాదు, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా వాము సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు ఉంటే వాముతో చేసిన రొట్టె సహాయపడుతుంది.