నిజానికి పెరుగును కాలాలతో సంబంధం లేకుండా తినొచ్చు. ఎందుకంటే ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎన్నో రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మధ్యాహ్నం పూట పెరుగును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. పెరుగును తింటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అంతేకాదు పెరుగు ఒత్తిడిని పెంచే కార్టిసాల్ లేదా స్టెరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో ఊబకాయం ప్రమాదం తగ్గుతుంది.
పెరుగు కూడా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఆడవాళ్లు పెరుగు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలలో ఇది కూడా ఒకటి. పెరుగు ఈస్ట్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలను తగ్గిస్తుంది. అంతేకాదు పెరుగులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.
రెగ్యులర్ గా పెరుగును తినడం వల్ల కలిగే ప్రయోజనాలలో.. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం కూడా ఉంది. అవును రెగ్యులర్ గా పెరుగును తింటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పెరుగు కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అలాగే గుండెను బలంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
curd
పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన మొత్తంలో కాల్షియం అందుతుంది. దీంతో మన ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. ఇది సయాటికా, ఇతర ఎముక సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పెరుగును కాలాలతో సంబంధం లేకుండా మధ్యాహ్నం పూట తినడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అసమతుల్య జీవనశైలి, కార్టిసాల్ అనే హార్మోన్ లో అసమతుల్యత వల్ల నడుములో కొవ్వు పేరుకుపోతుంది. పెరుగు కార్టిసాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అందుకే ఇది కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది.
పెరుగులో సులబంగా జీర్ణమయ్యే ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. రోజూ పెరుగును తినడం వల్ల కొరోనరీ హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పెరుగు ధమనుల్లో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నివారిస్తుంది.
curd
పెరుగులో విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్ వంటి అనేక ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవన్నీ మన స్కిన్ కలర్, చర్మ ఆకృతిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇది వివిధ చర్మ సమస్యలను వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.