నెయ్యిని ఎక్కువగా తినకండి.. ఈ సమస్యలొస్తయ్..

First Published | Nov 21, 2023, 1:14 PM IST

రుచిగా ఉంటుందని నెయ్యిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అందులోనూ ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది కూడా. అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే? నెయ్యిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మనకు ఎన్నో సమస్యలొచ్చేలా చేస్తుంది.
 

ghee

ఇండియన్స్ నెయ్యిని ఎక్కువగా వాడుతారు. ఎందుకంటే ఇది వంటలను టేస్టీగా చేస్తుంది కాబట్టి. అందుకే మనం ప్రతిరోజూ తినే స్నాక్స్ లో నెయ్యి ఒక ముఖ్యమైన పదార్ధంగా మారిపోయింది. నిజానికి ఇది కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిలో కరిగే కొవ్వు విటమిన్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

పెద్దలే కాదు పిల్లలు కూడా నెయ్యిని తినొచ్చు. ప్రతిరోజూ ఒక చెంచా నెయ్యిని తినడం వల్ల మన మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. గట్ ఆరోగ్యం కూడా బాగుండటంతో పాటుగా ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. నెయ్యి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా.. దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మనల్ని ఎన్నో సమస్యల బారిన పడేస్తుంది. 


ghee

ఆరోగ్యకరమైన నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, సంతృప్త కొవ్వులు, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర వహించే విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి వంటి కొవ్వులలో కరిగే విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. 

ghee

ఏదేమైనా నెయ్యిని మోతాదులోనే తీసుకోవాలి. ముఖ్యంగా 40 ఏండ్లు పైబడిన వారు నెయ్యిని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యిలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ కొవ్వులు మీ ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. కొవ్వు కాలేయ వ్యాధి ఉన్నవారు కూడా నెయ్యి పూర్తిగా మానేయాలి. లేదా చాలా తక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ghee

నెయ్యిలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే దీన్ని పెద్దవయసు వారు ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే వారికి గుండెజబ్బులొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వృద్ధులు నెయ్యికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

click me!