ఇందుకే చింతపండును తినాలని చెప్పేది

First Published | Nov 25, 2023, 1:12 PM IST

పుల్ల పుల్లని చింతపండును కొంతమంది ఇష్టంగా తింటే.. మరికొంతమంది మాత్రం దీనికి దూరంగా ఉంటారు. నిజానికి ఈ పుల పుల్లని చింతపండు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది తెలుసా? 
 

పులుపును ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. పులుపు నచ్చే వారు మాత్రం ప్రతికూరలో పులుపును ఖచ్చితంగా వాడుతుంటారు. ఈ రుచికి అలవాటు పడ్డవారికైతే చింతపండు లేకుండా కూరలు అస్సలు రుచిగానే అనిపించవు. నిజానికి టేస్ట్ కోసం ఉపయోగించే ఈ చింతపండు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది తెలుసా? చింతపండు యాంటీఆక్సిడెంట్ల భాండాగారం. దీనిలో విటమిన్ సి,  విటమిన్ ఇ, విటమిన్ బి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. మరి చింతపండును రెగ్యులర్ గా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను కలుగుతాయో ఇప్పుుడు తెలుసుకుందాం.. 


అజీర్ణం

ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే చింతపండును మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అజీర్ణం అనే సమస్యే ఉండదు. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది కూడా. 

అల్సర్లు 

చింతపండులో ఉండే పాలీఫెనోలిక్ సమ్మేళనాలు అల్సర్లను నివారించడానికి సహాయపడతాయి. అలాగే గట్ ఆరోగ్యాన్ని రక్షించడానికి తోడ్పడుతాయి. చింతపండును మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కాలెయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 
 


tamarind

బరువు తగ్గడం

చింతపండులో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. అందుకే చింతపండును మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆకలి బాగా తగ్గుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. చింతపండులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. 

Tamarind

ఇమ్యూనిటీ పవర్

చింతపండులో విటమిన్ సి తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.  దీన్ని తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మనం ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటాం. 
 


గుండె ఆరోగ్యం

పుల్లపుల్లని చింతపండులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. దీంతో మీ గుండె పదిలంగా, ఎలాంటి రోగాలు లేకుండా ఉంటుంది. 

బ్లడ్ షుగర్

బ్లడ్ షుగర్ పెరగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అయితే పుల్లని చింతపండు నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు సహజంగా నియంత్రణలోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 


కంటి ఆరోగ్యం

చింతపండులో కళ్లను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఎ, ఇతర యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇలాంటి చింతపండును మన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. 

నిద్రలేమి

నిద్రలేమి ఊబకాయం నుంచి గుండె జబ్బుల వరకు ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అందుకే ఈ సమస్యను వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. అయితే మెగ్నీషియం ఎక్కువగా ఉండే పుల్లని చింతపండు కూడా నిద్రలేమి సమస్యను పోగొట్టడానికి సహాయపడుతుంది. 

చర్మ ఇన్ఫెక్షన్లు

చింతపండులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అందుకే దీన్ని తినడం వల్ల మన చర్మం ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటుంది. అంటే చింతపండు మన చర్మాన్ని రక్షించడానికి కూడా సహాయపడుతుంది.
 

Latest Videos

click me!