రసం ఎంతో టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది ఇష్టంగా తాగుతారు. కొంతమంది అన్నంతో పాటు తింటారు. టమాటాలు, చింతపండు, మిరియాలు, జీలకర్ర, ఇతర మసాలా దినుసులతో తయారు చేసే రసంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో ఔషదగుణాలున్నాయి. రసాన్ని అన్నంతో పాటు తినొచ్చు లేదా భోజనం తర్వాత సూప్ గా తాగొచ్చు. దీన్ని ఎలా తీసుకున్నా దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.
చింతపండు రసం, పసుపు, నల్ల మిరియాలు, ఆవాలు, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలు ఉండే రసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది పోషక-దట్టమైన ఆహారాలలో ఒకటిగా చేరింది. మీకు తెలుసా? రసంలో విటమిన్లు, ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి.
రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, థయామిన్ మెండుగా ఉంటాయి. రసంలో ఉండే నల్ల మిరియాలు మన జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. రసంలో వేసిన చింతపండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మన చర్మాన్ని యవ్వనంగా, అందంగా ఉంచడానికి సహాయపడుతుంది.
మలబద్ధకం వంటి ఉదర సంబంధ సమస్యలతో బాధపడేవారికి రసం దివ్యౌషధం. దీనిలో ఉపయోగించే చింతపండులో డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఇక రసంలో ఉండే నల్ల మిరియాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇది ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో మన శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. దీంతో మన శరీర మెటబాలిజం సక్రమంగా పనిచేస్తుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.