ధనియాలతో డయాబెటీస్ కంట్రోల్.. ఎలా ఉపయోగించాలంటే?

First Published | Jun 15, 2023, 11:47 AM IST

ధనియాల్లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. మీకు తెలుసా? ఇవి మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 
 

మసాలా దినుసుల్లో ఒక్కటైన ధనియాలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే  ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఈ గింజలు మధుమేహులకు కూడా మంచి మేలు చేస్తాయి. ధనియా వాటర్ ను ఉదయాన్నే తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అసలు మధుమేహానికి కొత్తిమీర గింజల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..
 

యాంటీ-హైపర్ గ్లైసీమిక్ సమ్మేళనాలు

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ధనియాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో పరిశోధన ప్రకారం.. కొత్తిమీర విత్తన సారాలలో యాంటీ-హైపర్ గ్లైసీమిక్ లక్షణాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.అలాగే రక్తప్రవాహం నుంచి చక్కెరను తొలగించే ఎంజైమ్ల కార్యాచరణను పెంచుతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

Latest Videos


ఇన్సులిన్ విడుదల నియంత్రణ 

నిపుణుల ప్రకారం.. ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కొత్తిమీర విత్తనాలు కీలక పాత్ర పోషిస్తాయి. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం.. ఈ విత్తనాలు ప్యాంక్రియాటిక్ బీటా-కణాల నుంచి ఇన్సులిన్ విడుదలను నియంత్రించగలవని సూచించింది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తగినంత ఇన్సులిన్ స్థాయిలకు సహాయపడుతుంది.
 

డయాబెటీస్ మందుల లాగే..

ధనియాలు కూడా డయాబెటిస్ నియంత్రణను సహాయపడే మందుల మాదిరిగానే ప్రయోజనకరంగా ఉంటాయని కొన్ని ల్యాబ్ ట్రయల్స్ లో తేలిందని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం, డయాబెటిక్ ఎలుకలపై చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 
 

మెరుగైన జీర్ణక్రియ 

ధనియాలు జీర్ణ లక్షణాలకు ప్రసిద్ది చెందాయి. ధనియాల్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్రేగు కదలికలను మెరుగుపరుస్తాయి. అలాగే ఈ విత్తనాల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ గింజలు జీర్ణక్రియను పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. 

coriander

తక్కువ జీఐ ఆహారం

ధనియాల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది తొందరగా జీర్ణం అవుతుంది. డయాబెటిక్ డైట్ లో వీటిని తప్పకుండా చేర్చుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలలో వచ్చే హెచ్చుతగ్గులను నివారించడానికి తక్కువ జీఐ ఉన్న ఆహారాలను చేర్చుకోవడం చాలా అవసరం. ధనియాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 33 మాత్రమే. 

Coriander water

బరువు తగ్గడానికి 

కొత్తిమీర విత్తనాలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపును తొందరగా నింపుతుంది. ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలను ఆపేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 

డయాబెటిస్ కోసం కొత్తిమీర విత్తనాలను ఎలా ఉపయోగించాలి?

కొత్తిమీర విత్తనాల ప్రయోజనాలను పొందడానికి.. ప్రతిరోజూ ఉదయం ధనియా వాటర్ ను తాగాలని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర విత్తనాల నీటిని తయారు చేయడానికి.. ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర విత్తనాలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం పరిగడుపున తాగాలి. ఇది రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. కొత్తిమీర విత్తనాలను పప్పులు, కూరలు వంటి ఆహారాల్లో కూడా వేయొచ్చు.

click me!