ఈ కలర్ క్యాబేజీని తింటే ఎన్ని రోగాల ముప్పు తప్పుతుందో తెలుసా?

First Published | Oct 15, 2023, 2:46 PM IST

క్యాబేజీలు చాలా రంగులల్లో ఉంటాయి. వీటిలో పర్పుల్ కలర్ క్యాబేజీ కూడా ఉంది. ఈ రంగు క్యాబేజీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎన్నో రోగాల ముప్పును తగ్గిస్తుంది తెలుసా? 
 

చాలా మటుకు గ్రీన్ కలర్ క్యాబేజీలనే తింటుంటారు. కానీ క్యాబేజీలు ఎన్నో రంగుల్లో ఉంటాయి. వీటిలో పర్పుల్ క్యాబేజీ ఒకటి. మీకు తెలుసా? గ్రీన్ క్యాబేజీ కంటే పర్పుల్ క్యాబేజీనే మనకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఇది మీరు బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఆకుపచ్చ క్యాబేజీ కంటే పర్పుల్ క్యాబేజీలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఎందుకంటే దీనిలో మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మంటను తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. పర్పుల్ కలర్ క్యాబేజీలో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, మాంగనీస్, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం కూడా ఉంటాయి. 

Latest Videos


purple cabbage

పోషకాలు పుష్కలంగా ఉన్న క్యాబేజీలో యాంటీఆక్సిడెంట్లు, మన శరీరానికి అవసరమైన విటమిన్లు ఉంటాయి. ఈ క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పర్పుల్ కలర్ క్యాబేజీలో విటమిన్ సి,  విటమిన్ కె, కాల్షియం, మాంగనీస్, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. 

purple cabbage

పర్పుల్ కలర క్యాబేజీలోని డైటరీ ఫైబర్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి ముఖ్యమైన సూక్ష్మజీవుల జీవక్రియల ఉత్పత్తిని పెంచుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండే పర్పుల్ క్యాబేజీ ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పర్పుల్ కలర్ క్యాబేజీ శరీరంలో అదనపు ఈస్ట్రోజెన్ ను తొలగించడానికి సహాయపడుతుంది.

purple cabbage

పర్పుల్ కలర్ క్యాబేజీ కళ్ల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపర్చడానికి, కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే వీటిని సలాడ్లు, ఆకుకూరలతో కలిపి తినొచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉండే కూరగాయ కాబట్టి..ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. పర్పుల్ కలర్ క్యాబేజీలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే అల్సర్లను నివారించడానికి కూడా సహాయపడుతుంది. దీన్ని జ్యూస్ లేదా సూప్  గా తాగొచ్చు.

click me!