నానబెట్టిన జీడిపప్పును తింటే ఎంత మంచిదో తెలుసా?

First Published | Oct 14, 2023, 12:54 PM IST

పోషకాలు పుష్కలంగా ఉండే జీడిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. 
 

డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్లకంగా ఉంటాయి.  రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ను తింటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు ఒకటి. ఇది కూడా మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఈ డ్రై ఫ్రూట్ లో ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, జింక్, కాపర్ వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కానీ ఎండిన జీడిపప్పు కంటే నానబెట్టిన జీడిపప్పు మన శరీరానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందన్న సంగతి మీకు తెలుసా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నానబెట్టిన జీడిపప్పును రోజూ తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అసలు నానబెట్టిన జీడిపప్పును తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

ఆరోగ్యకరమైన గుండె 

పోషకాలు ఎక్కువగా ఉండే జీడిపప్పు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. జీడిపప్పుల్లో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన జీడిపప్పును రోజూ పరగడుపున తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
 


కంటి చూపు

జీడిపప్పు కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది కంటి రెటీనాను రక్షిస్తుంది. నానబెట్టిన జీడిపప్పులో ఉండే జియా క్సాంథిన్ వృద్ధులలో వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణతను నివారించడానికి సహాయపడుతుంది. అందుకే కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి నానబెట్టిన జీడిపప్పుతో మీ రోజును స్టార్ట్ చేయండి. 
 

జీర్ణక్రియ

నానబెట్టిన జీడిపప్పును తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పప్పుల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగు కదలిక ప్రక్రియను సులభతరం చేస్తుంది. నానబెట్టిన జీడిపప్పు కూడా సులభంగా జీర్ణం అవుతుంది. ఇది కడుపునకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది.

Image: Freepik

డయాబెటిస్ రోగులకు

ఇతర డ్రై ఫ్రూట్స్ తో పోలిస్తే జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్లు కూడా ఈ జీడిపప్పును తినొచ్చు. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచుతుంది.
 

cashewnuts

చర్మానికి మేలు 

జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంటాయి. చర్మ సంరక్షణలో జీడిపప్పు నూనెను కూడా చేర్చొచ్చు. ఇవి ఫైటోకెమికల్స్, ప్రోటీన్లు,  యాంటీఆక్సిడెంట్లకు గొప్ప వనరులు. దీన్ని ఉపయోగిస్తే మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది. 
 

స్ట్రోక్ నివారణ

జీడిపప్పులో మెగ్నీషియం తగినంత పరిమాణంలో ఉంటుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందుకోసం మీరు నానబెట్టిన జీడిపప్పులను క్రమం తప్పకుండా తినొచ్చు. జీడిపప్పు స్ట్రోక్ ను నివారిస్తుంది. 

Latest Videos

click me!