దానిమ్మ పండును రోజూ తింటే..!

First Published | Jun 2, 2023, 1:30 PM IST

పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. పండ్లలో ఒకటైన దానమ్మ పండును రోజూ తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Image: Getty

దానిమ్మ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మంచి పోషక పండు. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే దానిమ్మ పండ్లు అధిక రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి ఎంతో సహాయపడతాయి. ఈ దానిమ్మ పండులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి, విటమిన్ ఇ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. దానిమ్మలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్  లు కూడా పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ రసాన్ని రెగ్యులర్ గా తాగితూ మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. దానిమ్మను రోజూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయాంటే? 
 

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి దానిమ్మ ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ పండులో ఉండే నైట్రిక్ యాసిడ్ ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. దానిమ్మ 90 శాతానికి పైగా కొవ్వును, కొలెస్ట్రాల్ ను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పండు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

Latest Videos


Image: Getty Images

గుండె ఆరోగ్యం

దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ దానిమ్మ జ్యూస్ ను తాగుతూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

pomegranate

రక్తహీనత

రోజూ దానిమ్మ పండును తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే ఈ పండు రక్తహీనతను నివారించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు దానిమ్మను తినడం  మంచిది.

మెదడు ఆరోగ్యం

దానిమ్మ పండు మెదడు ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. ఈ పండ్లను తింటే ఒత్తిడి, మంట తగ్గిపోతాయి. 

జీర్ణ సమస్యలు

దానిమ్మలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ దానిమ్మ రసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. 
 

వెయిట్ లాస్

బరువు తగ్గాలనుకునే వారికి దానిమ్మ ఎంతో సహాయపడుతుంది. ఈ పండును బరువు తగ్గాలనుకునేవారు  డైట్ లో చేర్చుకోవచ్చు. 100 గ్రాముల దానిమ్మ గింజల్లో 83 కేలరీలు ఉంటాయి.
 

మధుమేహం

దానిమ్మ పండ్లలో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఈ పండ్లు మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడతాయి. 

ఆరోగ్యకరమైన చర్మం 

దానిమ్మ చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండును రోజూ తింటే మీ చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది. 

click me!