40 ఏండ్ల తర్వాత కూడా మీరు యవ్వనంగా ఉండాలంటే ఈ పండ్లను తినండి

First Published | Jun 1, 2023, 4:37 PM IST

వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఎన్నో రకాల బ్యూటీ క్రీమ్స్ ను వాడుతుంటారు. కానీ వృద్ధాప్య సంకేతాలను మాత్రం పోగొట్టుకోలేకపోతుంటారు. నిపుణులు ప్రకారం.. కొన్ని పండ్లు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి సహాయపడతాయి. 

Skin care

40 ఏండ్ల తర్వాత చర్మంపై ముడతలు, సన్నని గీతలు రావడం మొదలవుతుంది. వీటిని తగ్గించుకోవడానికి మనం ఎన్నోో రకాల చిట్కాలను పాటిస్తుంటాం. చాలా మంది ఇంటి నివారణలపై ఆధారపడతారు. కొంతమంది ఫేషియల్స్ ను ఉపయోగిస్తారు. అయితే చాలా మంది వ్యాయామం ద్వారా కూడా ఈ సంకేతాలను తగ్గిస్తారు. పదేపదే ఫేషియల్స్ చేయడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. హోం రెమెడీస్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అంత సమయం లేనివారు ఇలాంటి చిట్కాలను ఫాలో కాలేరు. నిపుణుల ప్రకారం.. కొన్ని పండ్లు 40 ఏండ్ల తర్వాత కూడా మీరు యవ్వనంగా ఉండటానికి సహాయపడతాయి. అవేంటంటే.. 

బ్లూబెర్రీ

బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఉంటాయాి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి సహాయపడతాయి. బ్లూబెర్రీలను  తినడం వల్ల చర్మం శుభ్రంగా ఉంటుంది.
 


Image: Getty Images

దానిమ్మ

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ సూర్యరశ్మి వల్ల కలిగే చర్మ నష్టం నుంచి రక్షించడానికి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.
 

avocado

అవోకాడో

అవొకాడోల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అవొకాడో చర్మాన్ని పోషించడానికి, స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి, సన్నని గీతలు, ముడతలు కనిపించకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

Strawberries

స్ట్రాబెర్రీలు

విటమిన్ సి ఎక్కువగా ఉండే స్ట్రాబెర్రీలు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. అలాగే చర్మ స్థితిస్థాపకతను, ఆకృతిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ముడతలు, సన్నని గీతలను తగ్గించడానికి సహాయపడతాయి.

kiwi

కివి

కివిలు విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. దీనివల్ల చర్మంపై నల్లటి మచ్చలు రావు.
 

Image: Getty

పుచ్చకాయ

పుచ్చకాయలో లైకోపీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్. ఇది సూర్యరశ్మికి చర్మం దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడుతుంది. పుచ్చకాయ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 

orange benefits

నారింజ

నారింజ విటమిన్ సి కి మంచి వనరు. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. చర్మ ఆకృతిని మెరుగుపరచడానికి, ముడతలను తగ్గించడానికి సహాయపడుతుంది. నారింజ పండ్లను తినడం వల్ల చర్మం బిగుతుగా ఉంటుంది.
 

പപ്പായ


బొప్పాయి

బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మాన్ని పునరుజ్జీవింపజేసే లక్షణాలను కలిగి ఉంటుంది. వాటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి సహాయపడతాయి.

Latest Videos

click me!