పచ్చి ఉల్లిపాయలను తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా?

First Published | Dec 14, 2023, 12:25 PM IST

పచ్చి ఉల్లిపాయలను సలాడ్ లో ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే చాలా మటుకు ఉల్లిపాయలను ప్రతి కూరలో వేస్తుంటారు. ఈ ఉల్లిపాయలు కూర రుచిని పెంచుతాయి. అయితే పచ్చి ఉల్లిపాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే.. తినకుండా అస్సలు ఉండలేరు. 
 

ఉల్లిపాయ

ఉల్లిపాయలు లేని కూరలు అసలే ఉండవేమో కదా. అందుకే ప్రతి వంటింట్లో ఉల్లిపాయలు ఖచ్చితంగా ఉంటాయి. నిజానికి ఉల్లిపాయలు కూరల టేస్ట్ ను పెంచుతాయి. కానీ కొంతమంది మాత్రం వీటిని సలాడ్ గా తినడానికి ఇష్టపడతారు. పచ్చి ఉల్లిపాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. పచ్చి ఉల్లిపాయల్లో మన శరీరానికి అవసరమైన విటమిన్-సి, విటమిన్ బి-6, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మరి పచ్చి ఉల్లిపాయలను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి. 
 

ఉల్లిపాయ

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా.. 

పచ్చి ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. అలాగే ఎన్నో రోగాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. 
 


ఉల్లిపాయ

క్యాన్సర్ నివారణ

పచ్చి ఉల్లిపాయలలో యాంటి క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయి. అంటే వీటిని మోతాదులో తింటే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

ఉల్లిపాయ

షుగర్ నియంత్రణ

పచ్చి ఉల్లిపాయ డయాబెటిక్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎలా అంటే మధుమేహులు పచ్చి ఉల్లిపాయలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 
 

ఉల్లిపాయ

గుండెను ఆరోగ్యంగా..

పచ్చి ఉల్లిపాయలను తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నార్మల్ గా ఉంటాయి. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ గా ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు పచ్చి ఉల్లిపాయలు తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. 
 

Image: Freepik

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు

ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అంటే వీటిని తినడం వల్ల మంట, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతాయన్న మాట. ముఖ్యంగా చలికాలంలో కీళ్లనొప్పుల నొప్పుల నుంచి బయటపడాలంటే పచ్చి ఉల్లిపాయలను మోతాదులో తినండి.

Image: Freepik

రోగనిరోధక శక్తి బలోపేతం.. 

మన రోగనిరోధక శక్తి  బలంగా ఉంటేనే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం. సీజనల్ వ్యాధులొచ్చే ప్రమాదం కూడా ఉండదు. అయితే పచ్చి ఉల్లిపాయల్లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంటే వీటిని తింటే మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. 
 

ఉల్లిపాయ

జీర్ణ ఆరోగ్యం

పచ్చి ఉల్లిపాయలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. మోతాదులో రోజూ పచ్చి ఉల్లిపాయలను తింటే మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. 

Latest Videos

click me!