చలికాలం వచ్చేసింది. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా వణుకుపుట్టిస్తోంది. ఈ వింటర్ లో చాలా మందికి ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎక్కువగా స్పైసీగా, హాట్ గా తినాలని అనిపిస్తూ ఉంటుంది. కొందరు అలాంటి ఫుడ్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే చేసుకొని తింటూ ఉంటారు. కొందరు బయటకు వెళ్లి, వాటిని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే, ఈ చలికాలంలో.. కచ్చితంగా టేస్ట్ చేయాల్సిన కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. చల్లని చలిలో కమ్మని ఈ ఫుడ్స్ తింటే.. అమృతం తిన్న అనుభూతి కలుగుతుంది. మరి, ఆ ఫుడ్స్ ఏంటి..? మీరు రుచి చూశారో లేదో చూసేయండి..