చుక్క నూనె లేకుండా ఇంట్లో మురుకులు చేయడం ఎలా..?

First Published | Dec 13, 2023, 12:49 PM IST

మురుకులను టేస్టీగా, ఆరోగ్యంగా చేసుకుంటే హ్యాపీగా సాయంత్రం వేళ  టీ తాగుతూ ఆస్వాదించవచ్చు. అయితే,  ఈ మురుకులను  తయారీ విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇప్పుడంటే మనకు మార్కెట్లో చాలా స్నాక్స్  దొరుకుతున్నాయి. కానీ, ఒకప్పుడు ఇన్ని వెరైటీలు దొరికేవి కావు. దీంతో, ఇంట్లోనే చేసుకునేవారు. అలా ఇంట్లో చేసుకునే బెస్ట్ స్నాక్స్ లో మురుకులు మొదటి స్థానంలో ఉంటాయి. ఇప్పటికీ, మనం ఈ మరుకులను ఇంట్లో తయారు చేరసుకుంటూ ఉంటాం. చేసుకోలేనివాళ్లు మార్కెట్లోనూ కొనుగోలు చేస్తున్నారు. ఈ మరుకులను మనం నూనెలో డీప్ గా ఫ్రై చేస్తాం అనే విషయం తెలిసిందే. కానీ, నూనెలో డీప్ ఫ్రై చేసినవి తినడానికి ఈరోజుల్లో కొందరు ఇష్టపడటం లేదు..అలాంటివారు.. ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా ఈ మరుకులను తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఓసారి చూద్దాం..
 


మురుకులను టేస్టీగా, ఆరోగ్యంగా చేసుకుంటే హ్యాపీగా సాయంత్రం వేళ  టీ తాగుతూ ఆస్వాదించవచ్చు. అయితే,  ఈ మురుకులను  తయారీ విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos


1.కావాల్సిన పదార్థాలు...ఒక కప్పు బియ్యం పిండి, పావు కప్పు మినపప్పు, 2టేబుల్ స్పూన్ల కరివేపాకు, ఒక టీస్పూన్ నువ్వులు, కొంచెం ఇంగువ, ఒక టీ స్పూన్  కారం, ఉప్పు,  కొంచెం మిరియాల పొడి, పిండి కలపడానికి కవాల్సిన నీరు. మరుకుల ప్రెస్ ఒకటి కావాలి.
 

dough

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా, ఒక ప్యాన్ తీసుకొని మినపప్పును కాస్త రోస్ట్ చేయాలి. బంగారు వర్ణంలోకి మారే వరకు వేయించుకోవాలి. తర్వాత దానిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మెత్తని పిండిలాగా చేసుకోవాలి.

ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వేయించి మిక్సీ చేసిన మినపప్పు పిండి, అందులోనే బియ్యం పిండి, కాస్త శెనగ పిండి వేయాలి.  బాగా కలిపిన తర్వాత అందులోనే నువ్వులు, కరివేపాకు, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీరు పోస్తే, పిండిని బాగా కలుపుకోవాలి.
 


ఇఫ్పుడు.. ఓ అరటి ఆకు లేదంటే, నూనె పూసిన పేపర్ లపై మురుకులను మురుకుల ప్రెస్ తో చేసుకోవాలి. ఒక్కొక్కటిగా చేసుకొని, అరిటాకుపై ఎండనివ్వాలి.  అవి ఎండేవరకు వాటిని కదిలించకూడదు.


అవి బాగా ఆరాయి అని కన్ఫామ్ అయిన తర్వాత ఎయిర్ ఫ్రయ్యర్ లో  180 నుంచి 200 డిగ్రీల వద్ద కనంసం 20 నుంచి 30 నిమిషాల పాటు వేయించాలి.  అంతే... కరకకరలాడే మురుకులు రెడీ.  వీటిని మనం హాయిగా ఆస్వాదించవచ్చు. నూనెలో ఎక్కువ వేగుతాయనే గిల్టీ ఫీలింగ్ లేకుండా.. వీటిని తినవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీటిని తయారు చేసుకోండి.

click me!