pineapple
ఎండాకాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లలో పైనాపిల్ ఒకటి. నిజానికి పైనాపిల్ ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ పండు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా వీటిలో ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పైనాపిల్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. పైనాపిల్ లోని పోషకాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి.
pineapple
పైనాపిల్ లో విటమిన్ సి, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉంటాయి. 905 గ్రాముల పైనాపిల్ లో 452 కేలరీలు, 119 గ్రాముల కార్బోహైడ్రేట్, 13 గ్రాముల ఫైబర్, 5 గ్రాముల పోటిన్ ఉంటాయి. అంతేకాదు వీటిలో మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, రాగి, విటమిన్ బి 6, ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ ను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే..?
pineapple
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
పైనాపిల్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి పండును తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కొల్లాజెన్ ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. పైనాపిల్ లో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
pineapple
జీర్ణక్రియ
పైనాపిల్ తినడం జీర్ణక్రియకు చాలా మంచిది. పైనాపిల్ లో 'బ్రోమ్లిన్ ' అనే డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది సులువుగా జీర్ణం అవుతుంది.
ఎముకల ఆరోగ్యం
పైనాపిల్ ను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. పైనాపిల్ లో ఎముకల ఎదుగుదలకు అవసరమైన మాంగనీస్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. కాగా సయాటికా ఉన్నవారు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించడానికి కూడా పైనాపిల్ సహాయపడుతుంది.
pineapple fruit
గుండె ఆరోగ్యం
ఫైబర్ పుష్కలంగా ఉండే పైనాపిల్ ను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పైనాపిల్ లో ఉండే బ్రోమ్లిన్ కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే పైనాపిల్ లో ఉండే పొటాషియం కూడా రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.
వెయిట్ లాస్
పైనాపిల్ బరువు తగ్గాలనుకునే వారికి కూడా బాగా సహాయపడుతుంది. పైనాపిల్ లో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు పైనాపిల్ ను ధైర్యంగా తినొచ్చు.
Pineapple
డయాబెటిస్ ఉన్నవారు పైనాపిల్ తినొచ్చా?
పైనాపిల్ లో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ.. ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను మందగించడానికి సహాయపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు పైనాపిల్స్ తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ మితంగా మాత్రమే తినాలి.