మీకు ఆపిల్స్ ఇష్టమా? వీటిని ఎండాకాలంలో తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | May 22, 2023, 12:35 PM IST

రోజుకో ఆపిల్ పండును తింటే డాక్టర్ కు దూరంగా ఉండొచ్చన్న సామేత అందరికీ తెలుసు. అయితే ఈ పండును ఎండాకాలంలో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు.  
 

Image: Getty Images

సాధారణంగా ఎండాకాలంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే  పండ్లనే తింటారు. అయితే ఈ సీజన్ లో కూడా యాపిల్ పండ్లను ఎంచక్కా తినొచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆపిల్ ఎన్నో రోగాలను దూరం చేస్తుంది. ఆపిల్ పోషకాలకు మంచి వనరు. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి, శరీరాన్ని చల్లబరిచే సామర్థ్యం ఆపిల్ కు ఉంది. దీనిలోని అధిక నీటి కంటెంట్ కారణంగా ఆపిల్స్ దాహం తీర్చడానికి, వేడినుంచి  రిఫ్రెష్ అనుభూతిని కలిగించడానికి సహాయపడతాయి. జ్యూసీ ఆపిల్ సంతృప్తికరమైన చిరుతిండి. 
 

Image: Getty Images

మన ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు కూడా యాపిల్స్ లో ఉంటాయి. ఇవి డైటరీ ఫైబర్ కు మంచి మూలం. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎండాకాలంలో వీటిని స్నాక్స్ గా తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆపిల్స్ లో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్. ఇది రోగనిరోధక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలను దూరం చేయడానికి సహాయపడుతుంది. అలాగే సెల్యులార్ రక్షణకు సహాయపడుతుంది. ఆపిల్స్ లో పొటాషియం కూడా ఉంటుంది. ఇది ఆర్ద్రీకరణ, గుండె పనితీరుకు అవసరమైన ఖనిజం.

Latest Videos


Apples

ఆపిల్ పండ్లను ఎండాకాలం భోజనంలో ఎన్నో రకాలుగా ఉపయోగించొచ్చు. వీటిని రిఫ్రెషింగ్ పానీయం కోసం హైడ్రేటింగ్ స్మూతీలలో కలపొచ్చు. లేదా తీపి, క్రంచీ ఎలిమెంట్ కోసం ముక్కలు చేసి సలాడ్లలో చేర్చొచ్చు. ఇంట్లో తయారుచేసిన పండ్ల సల్సా లేదా ఆపిల్ సాస్ తయారు చేయడానికి ఆపిల్స్ ను ఉపయోగించొచ్చు. దీనిని కాల్చిన మాంసాలతో సైడ్ డిష్ గా తినొచ్చు.
 

Image: Getty Images

అయితే ఎండాకాలంలో ఆపిల్స్ ను తినాలనుకుంటే స్థానికంగా లభించే, సీజన్ లో లభించే వాటినే కొనండి. చల్లని ఎండాకాలం చిరుతిండి కోసం.. హనీక్రిస్ప్, గాలా లేదా ఫుజి వంటి జ్యూసీ, క్రిస్ప్ రకాలను ఎంచుకోవడం మంచిది. 
 

Image: Getty

ఆపిల్స్ ను శీతాకాలం పండుగా పరిగణిస్తారు. అయినప్పటికీ వీటిని ఎండాకాలంలో కూడా తినొచ్చు. ఎందుకంటే వాటి ఆర్ద్రీకరణ లక్షణాలు, పోషక ప్రయోజనాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి ఈ ఎండాకాలంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి జ్యూసీ ఆపిల్ ను కొని తినండి. 

click me!