వీటిని తాగినా కొలెస్ట్రాల్ తగ్గుతుంది

First Published | May 21, 2023, 2:57 PM IST

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలు వస్తాయి. అందుకే ఇది పెరగకుండా  చూసుకోవాలి. అయితే కొన్ని డ్రింక్స్ ఈ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. 
 

cholesterol

అధిక కొలెస్ట్రాల్ నేడు చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతోంది. ఈ చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, అధిక రక్తపోటు, స్ట్రోక్, డయాబెటిస్ వంటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతే గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులు వస్తాయి. కొవ్వు ఎక్కువున్న ఆహారం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, అధిక మద్యపానం.. ఇవన్నీ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎర్ర మాంసం, కొవ్వు, స్వీట్లు, నూనె ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకూడదు. ఇలా చేస్తే మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. 


సోయా మిల్క్

సోయా మిల్క్ ఎన్నో రోగాలను దూరం చేయడానికి సహాయపడుతుంది. ఎక్కువ కొవ్వు పాల ఉత్పత్తులకు బదులుగా సోయా పాలను తాగితే మీ శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. ఇది బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. 
 

Oatmeal Water

ఓట్ మీల్

ఓట్ మీల్ లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటుగా మంచి కొలెస్ట్రాల్ స్థాయిని కూడా పెంచుతాయి. వోట్మీల్ వాటర్ ను తాగితే మంచి ఫలితాలను పొందుతారు. ఇందుకోసం ముందు రోజు రాత్రి నీటిలో ఓట్ మీల్ ను కలపండి. వీటిని ఫ్రిజ్ లో పెట్టండి. ఉదయాన్నే వీటిని బ్లెండర్ లో వేయండి. కావాలనుకుంటే పంచదార లేదా దాల్చిన చెక్క వేసి దీన్ని తాగొచ్చు.

green tea

గ్రీన్ టీ

పాలు, పంచదార కలిపిన టీ కంటే గ్రీన్ టీ నే మన ఆరోగ్యానికి మంచిది. దీనిలో కేలరీలు ఉండవు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది కూడా. గ్రీన్ టీలో కాటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

టమాటా జ్యూస్

టమోటాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టమోటాల్లో ఉండే లైకోపీన్లు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
 

blue berry juice

బెర్రీలు

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, కోరిందకాయలు వంటి బెర్రీలు అన్నీ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అందుకే ఈ రసాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Latest Videos

click me!