బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ లేదా కాలే వంటి క్రూసిఫరస్ కూరగాయలను ఎక్కువగా తీసుకునే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు కనుగొన్నాయి. ఇటువంటి ఆహారాలలో అత్యధిక స్థాయిలో కనిపించే సల్ఫోరాఫేన్, కార్సినోజెనిసిస్ అనేక దశలలో, వివిధ విధానాల ద్వారా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని మాడ్యులేట్ చేయగలదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా సల్ఫోరాఫేన్ హిస్టోన్ డీఎసిటైలేస్ లేదా హెచ్డిఎసిలను నిరోధిస్తుంది. క్యాన్సర్ తో పోరాడే వారికి ఈ ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి.