క్యాబేజీ కూర తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Dec 28, 2023, 1:54 PM IST

క్యాబేజీ కూరను చాలా మంది తినరు. ఎందుకంటే ఈ కూర అంత టేస్టీగా కాదని. కానీ దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీ కూరను తినడం ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే?

cabbage

క్యాబేజీలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయినా మనలో చాలా మంది ఈ కూరగాయను అస్సలు తినరు. ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉండదు. కానీ ఈ ఆకుపచ్చ కూరగాయ పోషక శక్తి కేంద్రం. ఇది మన మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అసలు క్యాబేజీ కూరను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పోషకాలు 

క్యాబేజీలో కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కూరగాయలో రోగనిరోధక పనితీరు మెరుగుపర్చడానికి, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ కె లు మెండుగా ఉంటాయి. అలాగే ఈ కూరగాయలో విటమిన్ బి 6, ఫోలేట్, మాంగనీస్ లు కూడా ఉంటాయి. ఇవి ఎన్నో శారీరక విధులకు మద్దతునిస్తాయి. 
 

క్యాన్సర్ నివారణ

క్యాబేజీలో గ్లూకోసినోలేట్స్ అని పిలువబడే సమ్మేళనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నివారణా లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు బయోయాక్టివ్ పదార్థాలుగా విచ్ఛిన్నమవుతాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. అలాగే కొలొరెక్టల్, రొమ్ము క్యాన్సర్ తో పాటుగా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఇవి సహాయపడతాయి.
 

రోగనిరోధక శక్తి

క్యాబేజీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాబేజీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

జీర్ణక్రియ మెరుగు 

క్యాబేజీలో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. అలాగే గట్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. క్యాబేజీలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. 
 

శోథ నిరోధక లక్షణాలు

క్యాబేజీలో ఉండే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మంటను తగ్గిస్తుంది. అలాగే సంక్రమణతో పోరాడటానికి సహాయపడుతుంది, దీర్ఘకాలిక మంట ఎన్నో రోగాలకు దారితీస్తుంది. క్యాబేజీలో ఉండే సల్ఫోరాఫేన్, కెంప్ఫెరోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఈ దీర్ఘకాలిక మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

click me!