చలికాలంలో నీరసం వదిలించి, ఎనర్జీ నింపే ఫుడ్స్ ఇవి..!

First Published | Dec 27, 2023, 1:17 PM IST

ఆ నీరసం, చలికాలం బద్దకానికి మనకు ఏ పనీ చేయాలని కూడా అనిపించదు. అలాంటి బద్దకాన్ని మనం కొన్ని రకాల ఫుడ్స్ తో తరిమికొట్టవచ్చు.అంతేకాకుండా మనకు తక్షణ ఎనర్జీని కూడా అందిస్తాయి. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
 

చలికాలంలో చల్లని గాలులు మనకు తగులుతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. జలుబు, తలనొప్పి వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఆహారం తీసుకున్నా సరే ఈ చలికాలంలో మనకు నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ నీరసం, చలికాలం బద్దకానికి మనకు ఏ పనీ చేయాలని కూడా అనిపించదు. అలాంటి బద్దకాన్ని మనం కొన్ని రకాల ఫుడ్స్ తో తరిమికొట్టవచ్చు.అంతేకాకుండా మనకు తక్షణ ఎనర్జీని కూడా అందిస్తాయి. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
 

Oatmeal


1.ఓట్ మీల్..
ఓట్స్ చాలా మందికి తినాలని అనిపించదు. కానీ ఈ ఓట్ మీల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చలికాలంలో ఈ ఓట్ మీల్ తినడం వల్ల నీరసం మనల్ని వదిలేసి పారిపోతుంది. తక్షణ ఎనర్జీ అందిస్తుంది. దీనిలోని కార్బో హైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ గట్ ఆరోగ్యానికి సహాయపడటంతో పాటు.. చలికాలంలో మంచి ఎనర్జీని అందిస్తాయి.
 


2.బీట్ రూట్..
ఆరోగ్యకరమైన కూరగాయలలో బీట్ రూట్ కూడా ఒకటి. ఈ చలికాలంలో బీట్ రూట్ మరింత ఆరోగ్యాన్ని అందిస్తుంది. దీనిలో జింక్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు ఎనర్జీ ఇవ్వడంతో పాటు, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
 

3.అరటి పండ్లు..
అరటి పండ్లలో కార్బో హైడ్రేట్స్, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు తక్షణ శక్తిని ఇవ్వడంలో  సహాయపడతాయి. గట్ ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి.
 

4.నట్స్..
నట్స్ మనకు తక్షణ శక్తి ఇవ్వడంలో సహాయపడతాయి. వీటిలో ఆరోగ్యకరమైన హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి నీరసాన్ని వెంటనే తిరిమి కొడతాయి.
 

5.కోడి గుడ్లు..
కోడిగుడ్లలో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్ బీ12, విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి తక్షణ ఎనర్జీని అందించడంలోనూ సహాయపడతాయి. రోజంతా ఎనర్జీని అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

Latest Videos

click me!