వావ్.. చిటికెడు ఇంగువ ఇన్ని రోగాలను తగ్గిస్తుందా?

First Published | Dec 27, 2023, 12:44 PM IST

ఇంగువను  రెగ్యులర్ గా వాడే వారు ఉన్నారు. ఎందుకంటే ఇది ఫుడ్ ను మరింత టేస్టీగా చేస్తుంది. కానీ ఇంగువ ఇంతకు మించి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అవును ఇంగువను ఉపయోగించి మనం రక్తపోటును తగ్గించుకోవచ్చు. అలాగే కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే.. 
 

మన దేశంలో మసాలా దినుసులను బాగా ఉపయోగిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిలో ఇంగువ ఒకటి. ఇది వంటల రుచిని అమాంతం అలా పెంచేస్తుంది. ఈ కారణంగానే చాలా మంది  ఇగువును రెగ్యులర్ గా వాడుతుంటారు. మనకు తెలియని విషయం ఏంటంటే? ఇంగువ మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే దీనిని ఆయుర్వేద చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఇంగువను ప్రధానంగా చిక్కుళ్ల రుచిని పెంచడానికి, ఊరగాయలు, చట్నీలను మరింత టేస్టీగా మార్చడానికి ఉపయోగిస్తారు. 
 

ఇంగువ మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి చాలా తక్కువ మందికే తెలుసు.  ఇంగువ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే ఉబ్బసం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు, తలనొప్పిలను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 


ఆయుర్వేదంలో.. ఇంగువను ఎంతో ముఖ్యమైందిగా భావిస్తారు. ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇంగువ మన గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది ఆస్తమా పేషెంట్లకు కూడా మంచి మేలు చేస్తుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయని చెప్తారు. అందుకే దీన్ని శీతాకాలంలో కూడా వాడొచ్చని వైద్యులు చెబుతారు. 

ఇంగువలో ఉండే ఈ ఔషదగుణాలు.. ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులున్న వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంగువను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల తలనొప్పి, పొడి దగ్గు, నెలసరి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది రక్త నాళాలలో మంటను కూడా తగ్గిస్తుంది.

ఇంగువ జీర్ణవ్యవస్థకు కూడా మంచి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తారు. ఎందుకంటే దీనిలో ఉండే కార్బినేటివ్ లక్షణాలు జీర్ణ వ్యాధులను నయం చేస్తాయి. ఇంగువ ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అజీర్థి సమస్యను తగ్గించుకోవడానికి కూడా ఇంగువ ఉపయోగపడుతుంది. అలాగే ఇది కడుపు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఎవరికైనా పంటి నొప్పి ఉంటే నొప్పి ఉన్న చోట కొంచెం ఇంగువ ముద్దను పెడితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

Latest Videos

click me!