బెండకాయను తేలిగ్గా తీసిపారేయకండి.. దీనితో బోలెడు లాభాలున్నాయి మరి

First Published | Jun 29, 2023, 4:26 PM IST

బెండకాయ బరువును తగ్గించడం నుంచి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ బెండకాయ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది తెలుసా?  
 

బెండకాయ ఎన్నో పోషకాలను కలిగున్న ఆరోగ్యకరమైన కూరగాయ. బెండకాయ ఎన్నో రకాల విటమిన్లు, పోషకాల భాండాగారం. బెండకాయలో విటమిన్ సి, విటమిన్ కె1 పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ కె1 కొవ్వులో కరిగే విటమిన్. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

Image: Getty Images

బెండకాయలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ దీనిలో ప్రోటీన్, ఫైబర్ లు  కూడా సమృద్ధిగా ఉంటాయి. బెండకాయ ఫోలేట్ కు మంచి వనరు. ఇది పిండంలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి చాలా అవసరం. అందుకే బెండకాయ గర్భిణులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 
 


okra

బెండకాయ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. బెండకాయ జీర్ణశయాంతర ప్రేగులలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. ఫోలేట్ లేదా విటమిన్ బి 9 గర్భిణీ స్త్రీలకు చాలా అవసరమైన పోషకం. ఈ ఫోలెట్ బెండకాయలో పుష్కలంగా ఉంటుంది. పెరుగుతున్న పిండం మెదడు, వెన్నెముక అభివృద్ధిని ప్రభావితం చేసే న్యూరల్ ట్యూబ్ లోపం ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.

ఎముకలు, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన విటమిన్లను, ఖనిజాలను బెండకాయ అందిస్తుంది. విటమిన్ ఎ తో పాటుగా బీటా కెరోటిన్, క్సాంథిన్, లుటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా బెండకాయలో ఉంటాయి. ఇవి కంటిచూపును పెంచడానికి సహాయపడతాయి. 
 

okra

బెండకాయను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకుంటే కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి బెండకాయలో పుష్కలంగా ఉంటుంది. బెండకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యల ప్రమాదం తగ్గుతుంది. బెండకాయలోని ఫైబర్స్ శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తొలగించడానికి సహాయపడతాయి.

బెండకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. బెండకాయ మహిళల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

Latest Videos

click me!