బెల్లీ ఫ్యాట్ ని కరిగించే బెస్ట్ డ్రింక్స్ ఇవి..!

First Published | Jun 29, 2023, 12:17 PM IST

కఠిన వ్యాయామాలు, వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. అయితే, వీటతో పాటు కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల కూడా మనం సులభంగా బరువు తగ్గడంతో పాటు, బెల్లీ ఫ్యాట్ ని కరిగించవచ్చట. మరి ఆ డ్రింక్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..

belly fat loss

ఈ రోజుల్లో బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. దానిని కరిగించడానికి చాలా మంది చాలా తిప్పలు పడుతూ ఉంటారు. కఠిన వ్యాయామాలు, వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. అయితే, వీటతో పాటు కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల కూడా మనం సులభంగా బరువు తగ్గడంతో పాటు, బెల్లీ ఫ్యాట్ ని కరిగించవచ్చట. మరి ఆ డ్రింక్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..

lemon water


1.నిమ్మకాయ నీరు..
ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకొని తాగాలట. అలా తాగడం వల్ల మన శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. మెటాబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.


cinnamon

2.దాల్చిన చెక్క , తేనే నీరు..
ఉదయాన్నే పరగడుపున గోరు వెచ్చని నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి, అందులోనే ఓ స్పూన్ తేనే కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తాగాలి. ఇది శరీరంలో కొవ్వు కరిగించడానికి ఎక్కువ సహాయం చేస్తుంది.

turmeric

3.పసుపు నీరు..
పసుపు నీటిని రోజూ తాగడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గుతారట. బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ ప్రతిరోజూ ఈ నీటిని తీసుకుంటూ ఉంటుందట.

4.జీలకర్ర నీరు..
జీలకర్రను రాత్రిపూట నీటిలో నానపెట్టి, ఆ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల కూడా అరుగుదల సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా పొట్టలోని కొవ్వును కూడా కరిగించవచ్చు.
 

coconut water


5.వేడినీరు..
నీటిలో ఏదీ కలుపుకోవడం ఇష్టం లేనివారు కేవలం గోరు వెచ్చని నీరు తాగడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గవచ్చట. అదేవిధంగా బెల్లీ ఫ్యాట్ ని కరిగించవచ్చు.

Image: Freepik


6.గ్రీన్ టీ..
 గ్రీన్ టీ సైతం శరీరంలో కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది. అంతేకాదు, బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుందట. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్  దీనిని తీసుకోవడం చాలా మంచిదట.

Latest Videos

click me!