ములక్కాయను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Jun 29, 2023, 2:48 PM IST

మునక్కాయలో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మనల్ని జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతాయి. అలాగే మన ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

మునక్కాయను మన రోజువారి ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మునక్కాయలో విటమిన్ సితో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది జలుబు, దగ్గు, ఫ్లూతో పోరాడటానికి, ఎన్నో ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడుతుంది.
 

Drumstick

మునక్కాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆస్తమా, దగ్గు, శ్వాస ఆడకపోవడం, ఇతర శ్వాసకోశ సమస్యల లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి. మునక్కాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అలాగే రక్తపోటు కూడా తగ్గుతుంది. 

Latest Videos


మునగాకులో విటమిన్ సి, ఇతర యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన కాల్షియం, ఐరన్ మునక్కాయలో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మునక్కాయలో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు వీటిలో నియాసిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 12 వంటి ఇతర బి విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తాయి. మునక్కాయలో ఉండే యాంటీ బయాటిక్స్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కూడా మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

మునక్కాయ విటమిన్ సి కి గొప్ప మూల. అలాగే దీనిలో రోగనిరోధక శక్తిని పెంచే ఫైటోన్యూట్రియెంట్స్ కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంటువ్యాధులను నివారించడానికి సహాయపడుతుందని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్డిఎ) తెలిపింది. మునక్కాయలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది స్పెర్మ్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

మునక్కాయ చర్మానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. వీటిలో నేచురల్ విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. మునక్కాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముఖంపై సన్నని గీతలు తొలగిపోతాయి.

click me!