తులసి విత్తనాలనే సబ్జా గింజలు అంటారు. ఇవి చలువ చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఎండాకాలంలో వీటిని పానీయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ విత్తనాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడతాయి. కానీ చాలా మంది తులసి విత్తనాలు చేసే మేలు తెలియక వీటిని ఉపయోగించడం లేదు.