చలికాలంలో ఈ కూరగాయలను తిన్నారంటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు

First Published | Nov 30, 2023, 1:26 PM IST

చలికాలంలో  మన రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో మనకు దగ్గు, జబులు, జ్వరాలతో పాటుగా ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలు కూడా వస్తుంటాయి. అయితే ఈ సీజన్ లో మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

చలికాలం వచ్చిందంటే చాలు మన డైట్ నుంచి డ్రెస్ వరకు అన్నీ మారిపోతాయి. ఈ సీజన లో చలి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే ఈ కాలంలోనే మన ఇమ్యూనిటీ పవర్ చాలా బలహీనంగా ఉంటుంది. ఇదే మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు, ఇన్ఫెక్షన్లకు గురిచేస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ సీజన్ లో మనం కొన్ని ఆహారాలను తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే ఎన్నో రోగాలకు కూడా దూరంగా ఉంటాం. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి. 

రూట్ వెజిటేబుల్స్ రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అయినా ఈ సీజన్ లో మనకు ఎన్నో రకాల రూట్ వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. చలికాలంలో మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి రూట్ వెజిటేబుల్స్ ను తినాలో తెలుసుకుందాం పదండి. 


క్యారెట్లు

చలికాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా క్యారెట్లే కనిపిస్తాయి. బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండే క్యారెట్లలో విటమిన్ ఎ మెండుగా ఉంటుంది. ఇది మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. క్యారెట్లలో మంచి మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. 
 

అల్లం

చలికాలంలో అల్లాన్ని మన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అల్లంలో ఉండే వివిధ పోషకాలు మన జీవక్రియను పెంచుతాయి. అల్లంలో ఉండే జింజెరోల్, షోగోల్ వంటి సమ్మేళనాలు జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తాయి. అలాగే అల్లంలోని థర్మోజెనిక్ స్వభావం మన శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. దీంతో జీవక్రియ పెరుగుతుంది. 
 

చిలగడదుంప

డయాబెటీస్ పేషెంట్లకు చిలగడదుంప ఓ వరం. ఎందుకంటే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుంది. చిలగడదుంపలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని చలికాలంలో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఈ సహజ తీపి కూరగాయలు అధిక ఫైబర్ తో నిండిఉంటాయి. శీతాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా ఎరుపు-ఎరుపు క్యారెట్లు కనిపిస్తాయి. బీటా కెరోటిన్ అధికంగా ఉండే క్యారెట్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది, జీవక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
 

ముల్లంగి

చలికాలంలో ముల్లంగిని తింటే కూడా ఎంతో మంచి జరుగుతుంది. ముల్లంగిలో ఉండే గ్లూకోసినోలేట్స్ వంటి సమ్మేళనాలు ఆహారాన్ని విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లను ప్రేరేపిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే పోషక శోషణను ప్రోత్సహిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. 
 

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటుగా అల్లిసిన్, ఇతర సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. అలాగే జీవక్రియ విధులను ప్రోత్సహిస్తాయి. ఇది జీవక్రియ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే చక్కెర శోషణను మందగించడానికి సహాయపడతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత అవకాశాలను కూడా తగ్గిస్తుంది.

Latest Videos

click me!