చలికాలంలో టమాటాలను తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 29, 2023, 1:12 PM IST

మనం టమాటాలను దాదాపుగా ప్రతి కూరలో వేస్తుంటాం. ఎందుకంటే కూర టేస్టీగా అవుతుందని.. నిజానికి టమాటలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అయితే చలికాలంలో ఈ టమాటాలను తింటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు తెలుసా? 
 

Image: Getty Images

టమాటాలు పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయ. దీన్ని చలికాలంలో ఖచ్చితంగా రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలమొక్కటే కాదు మిగతా కాలాల్లో కూడా వీటిని తింటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్స్, ప్రోటీన్, లైకోపీన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. 

విటమిన్ సి తో పాటుగా ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే టమాటాలను చలికాలంలో తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. టమాటాలను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె  ఆరోగ్యంగా ఉంటుంది. టమాటాల్లో లైకోపీన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కెరోటినాయిడ్. ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మన రోజువారీ ఆహారంలో పొటాషియం పుష్కలంగా ఉండే టమాటాలను చేర్చడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. 
 

Latest Videos


టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి టమాటాలను రెగ్యులర్ గా తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు టమాటాలను తినడం వల్ల మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశమే ఉండదు. టమాటాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
 

ఒక కప్పు చిన్న టమాటాల్లో సుమారుగా 2 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లు కూడా టమాటాలను తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కేలరీలు కలిగిన టమాటాలను కూడా డైట్ లో చేర్చుకోవచ్చు. అలాగే విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే టమాటాలను తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

click me!