వెజిటేబుల్ కర్రీ అయినా.. సలాడ్ అయినా.. టమాటాలు ప్రతి ఫుడ్ రుచిని పెంచుతాయి. అందుకే కదా మనం చూసే ప్రతిలో టమాటాలు ఖచ్చితంగా ఉంటాయి. దీనితో పప్పుచారు, చట్నీ అంటూ ఎన్నో వంటకాలను తయారుచేస్తారు. టమాటాల్లో విటమిన్ -సి, ఫైబర్ , కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. టమాటాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. వీటిని అతిగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అవును టమాటాలను అతిగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రుమాటిక్ నొప్పి
కీళ్ల నొప్పుల సమస్యలు వారు టమాటాలను అతిగా అస్సలు తినకూడదు. ఎందుకంటే టమాటాల్లో సోలనిన్ అనే ఆల్కలీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కీళ్లలో మంట, నొప్పిని కలిగిస్తుంది. అందుకే కీళ్ల నొప్పులతో బాధపడేవారు టమాటాలు తక్కువగా తినాలి.
మూత్రపిండాల్లో రాళ్లు
మీకు మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే కూడా టమాటాలను అతిగా తినకండి. ఎందుకంటే టమాటాల్లో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మీరు ఆహారంలో అవసరమైన దానికంటే ఎక్కువ టమాటాలను ఉపయోగిస్తే మీ మూత్రపిండాల్లోని రాళ్ల సమస్య మరింత పెరుగుతుంది. అందుకే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు టమాటాలు తినడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాలి.
ఎసిడిటీ సమస్య
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం చాలా మంది గ్యాస్, ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. మీరు టమాటాలను ఎక్కువగా తింటే గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే మీ ఆహారంలో టమాటాల పరిమాణాన్ని తగ్గించండి.
Tomato
అలెర్జీలు, అంటువ్యాధులు
కొంతమందికి టమాటాలు తినడం వల్ల అలెర్జీ ఉంటుంది. వీళ్లు టమాటాలు ఎక్కువగా తినడం వల్ల నోరు, నాలుక, ముఖంలో వాపు వస్తుంది. అలాగే గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా వస్తాయి.