దుర్గమాతకు అంకితమైన నవరాత్రి పర్వదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నవరాత్రుల్లో ఇది ఆరో రోజు. నవరాత్రుల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి భక్తులు పూజలు చేస్తారు. అయితే చాలా మంది తొమ్మిది రోజులు లేదా రెండు రోజులు ఉపవాసం కూడా ఉంటుంటారు. ఈ సమయంలో సాత్విక ఆహారం, పండ్లను తీసుకుంటారు.
మీరు కూడా నవరాత్రులకు ఉపవాసం ఉన్నట్టైతే మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా, శక్తివంతంగా ఉంచడానికి మీరు కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవచ్చు. వీటిని తాగడం వల్ల ఉపవాసం సమయంలో రిఫ్రెష్ గా ఫీలవుతారు. అంతేకాదు మిమ్మల్ని ఎనర్జిటిక్ గా కూడా ఉంచుతాయి. ఇందుకోసం ఎలాంటి పానీయాలను తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
కొబ్బరి నీరు
నవరాత్రుల ఉపవాసం సమయంలో మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి కొబ్బరి నీటిని తాగండి. ఇది మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. పోషకాలు ఎక్కువగా ఉండే కొబ్బరి నీటిని తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు.
పైనాపిల్ రసం, అల్లం
ఈ జ్యూస్ ను తాగితే ఉపవాసం సమయంలో రిఫ్రెష్ గా ఉంటారు. ఇందుకోసం పైనాపిల్ జ్యూస్ లో ఒకటి లేదా రెండు టీస్పూన్ల అల్లం రసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి తాగాలి. కావాలనుకుంటే ఈ జ్యూస్ లో ఐస్ ను కూడా కలుపుకోవచ్చు.
watermelon juice
పుచ్చకాయ జ్యూస్
ఉపవాస సమయంలో పుచ్చకాయ జ్యూస్ ను కూడా తాగొచ్చు. ఇది టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఒక గ్లాసు పుచ్చకాయ రసంలో నిమ్మరసం, తులసి ఆకులు, చిటికెడు రాతి ఉప్పును వేసి బాగా కలిపి తాగండి. ఇది మిమ్మల్ని రోజంగా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.
పసుపు పాలు
పసుపు పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలిసిందే. ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరం ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఉపవాసం సమయంలో చాలా మంది అలసటగా, బలహీనంగా ఉంటారు. ఈ పానీయాన్ని తాగితే మీకు మంచి అనుభూతి కలుగుతుంది. దీన్ని తయారు చేయడానికి పాలను మరిగించి అందులో ఒక టీస్పూన్ పసుపు, నల్ల మిరియాల పొడిని కలపండి.
lemon juice
నిమ్మకాయ రసం
నిమ్మరసాన్ని తయారుచేయడం చాలా సులువు. దీనిని ఎండాకాలంలో ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఉపవాస సమయంలో దీన్ని తాగడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం వేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి లేదా కేవలం రాక్ సాల్ట్ మాత్రమే కలుపుకుని తాగొచ్చు. ఇది మిమ్మల్ని ఎనర్జిటిక్ గా చేయడమే కాకుండా మీరు బరతు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.