Piles: పైల్స్ ఎంతో ఇబ్బందికరమైన సమస్య. దీనివల్ల కూర్చోవడానికి, నడవడానికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను తినకూడదు. ఎందుకంటే అవి పైల్స్ సమస్యను మరింత పెంచుతాయి.
ఈ మధ్యకాలంలో మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటిలో పైల్స్ ఒకటి. ఈ పైల్స్ వల్ల మలద్వారం దగ్గర వాపు, నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు విపరీతమైన నొప్పి వస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి సమస్యను మరింత పెంచుతాయి. కాబట్టి అర్శమొలలు ఉన్నవారు ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
26
టీ, కాఫీ
అర్శమొలలు ఉన్నవారు టీ, కాఫీలను అస్సలు తాగొద్దు. ఎందుకంటే వీటిలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం నుంచి వాటర్ ను బయటకు పంపి డీహైడ్రేట్ చేస్తుంది. దీంతో పైల్స్ సమస్య మరింత పెరుగుతుంది. డీహైడ్రేషన్ తో మలం గట్టిపడి మలవిసర్జన సమయంలో రక్తస్రావం అవుతుంది. వీటిలోని కెఫిన్ కంటెంట్ మలద్వారం, జీర్ణ వ్యవస్థలో మంట కలిగిస్తుంది. అందుకే పైల్స్ సమస్య ఉన్నవారు టీ, కాఫీలను ఎక్కువగా తాగకూడదు.
36
స్పైసీ ఫుడ్
అర్శమొలలు ఉన్నవారు స్పైసీ ఫుడ్ ను ఎక్కువగా తినకూడదు. కారం, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, మిరపకాయలు వంటి కారంగా ఉండే ఆహారాలను తినకూడదు. వీటిని తింటే జీర్ణవ్యవస్థలో మంట పెరుగుతంది. దీంతో మలవిసర్జన సమయంలో మంట,దురద, నొప్పి వాపు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు స్పైసీ ఫుడ్ వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అందుకే పైల్స్ ఉన్నవారు తేలికగా అరిగే ఆహారాలనే తినాలి.
పేపుడు ఆహారాలు నోటికి టేస్టీగా ఉంటాయి.. కానీ వీటిలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. అలాగే మలబద్దకం సమస్య వస్తుంది. పైల్స్ సమస్య ఉన్నవారు వీటిని తింటే మలవిసర్జన సమయంలో రక్తస్రావం అవుతుంది. అర్శమొలల సమస్య మరింత పెరుగుతుంది.
56
ఉప్పు
అర్శమొలలు ఉన్నవారు ఆహారంలో ఉప్పును ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది. అలాగే మలద్వారం వద్ద దురద, నొప్పిని కలిగిస్తుంది. అలాగే అర్శమొలలు ఉన్నవారు మసాలా దినుసులను కూడా ఎక్కువగా తినకూడదు. ఇవి పైల్స్ సమస్యను మరింత పెంచుతాయి.
66
తీపి
మీకు అర్శమొలలు గనుక ఉంటే తీపి పదార్థాలను తినడం తగ్గించండి. ఎందుకంటే ఇవి జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. పైల్స్ సమస్యను పెంచుతాయి. అలాగే మలద్వారం చుట్టూ వాపునకు కారణమవుతుంది.అందుకే మీరు చక్కెర పదార్థాలను తినకూడదు. కాకపోతే నేచురల్ షుగర్స్ అయిన పండ్లను, తేనెను తినొచ్చు. ఇవి ఎలాంటి చెడు చేయవు.