పెరుగుతో కలిపి తినకూడని ఆహారాలు:
చేప - పెరుగు, చేప కలిపి అస్సలు తినకూడదు. ఈ రెండింటినీ కలిపి తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. చేపల్లో ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. పెరుగు చల్లని స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రెండు లక్షణాలు కలిస్తే శరీరంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. చేప, పెరుగు కలిపి తింటే కడుపులో అసౌకర్యం, గుండెల్లో మంట వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, ఈ రెండు కలయిక శరీరంలో వేడి, చలి సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల చర్మం పగుళ్లు, దద్దుర్లు, దురద, ఎరుపు వస్తుంది. కాబట్టి చేప తిన్న రెండు గంటల తర్వాత పెరుగు తినడం మంచిది.