నిమ్మకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచి ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. అందుకే చాలా మంది నిమ్మరసాన్ని తాగుతుంటారు. అలాగే ఫుడ్ లో కలుపుకుని తింటుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని ఆహారాలకు నిమ్మరసాన్ని అస్సలు కలపకూడదు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసాన్ని ఏయే ఆహారాకల్లో కలపొద్దో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
28
పాల ఉత్పత్తులు
పాల ఉత్పత్తుల్లో నిమ్మరసాన్ని కలిపి తినకూడదు. ఎందుకంటే దీనిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. మీరు పెరుగు, పాలు, చీజ్ వంటి పాల ఉత్పత్తులకు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
38
మసాలా ఫుడ్స్
బిర్యానీతో పాటుగా చికెన్, మటన్, ఫ్రైడ్ రైస్ వంటి స్పైసీ ఆహారాల్లో ఖచ్చితంగా నిమ్మరసాన్ని పిండుకుని తినేవారు చాలా మందే ఉన్నారు. కానీ నిమ్మరసాన్ని మసాలా ఫుడ్స్ తో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
48
మజ్జిగ
మజ్జిగ మంచి హెల్తీ ఫుడ్. చాలా మంది దీన్ని ఎంతో ఇష్టంగా తాగుతారు. అయితే మజ్జిగలో నిమ్మరసాన్ని కలిపి తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగితే జీర్ణక్రియ దెబ్బతింటుంది.
58
గుడ్డు
గుడ్డును నిమ్మరసంతో తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తింటే గుడ్డులోని ప్రోటీన్ తగ్గుతుంది. అందుకే ఎప్పుడైనా సరే గుడ్డును తిన్న తర్వాత నిమ్మరసం తాగకూడదు.
68
పండ్లు
కొంతమంది పండ్లను తిన్న తర్వాత నిమ్మరసాన్ని తాగుతుంటారు. కానీ అరటిపండ్లు, మామిడి పండ్లు, స్ట్రాబెర్రీ , ఆపిల్ వంటి పండ్లను తిన్న తర్వాత నిమ్మరసం తాగొద్దు. ఇలా తాగితే ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
78
టమాటా
టమాటా, నిమ్మకాయ రెండింటిలో కూడా యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి తింటే ఎసిడిటీ సమస్య వస్తుంది.
88
క్యారెట్
క్యారెట్ ను తినేటప్పుడు లేదా తిన్న తర్వాత నిమ్మరసాన్ని అస్సలు తాగకూడదు. ఎందుకంటే క్యారెట్ లో ఉండే కొన్ని రసాయనాలు నిమ్మరసంతో చర్య జరుపుతాయి. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.