కల్తీ పసుపు.. మీరు వాడేది కల్తీ అయ్యిందా? లేదా? అనేది ఇలా గుర్తించండి

Published : Aug 23, 2025, 10:24 AM IST

పసుపును మనం ప్రతి కూరలో వాడుతాం. ఇది ఉపయోగించే వరకు కూరలే కావు. ఇది కూరలకు మంచి రంగును తేవడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే ఈ పసుపు కూడా కల్తీ అవుతోంది. దీనివల్ల ఎన్నో వ్యాధులు కూడా వస్తాయి తెలుసా? 

PREV
16
కల్తీ పసుపు

మనం వాడే మసాలా దినుసుల్లో పసుపు ఒకటి. దీన్ని పక్కాగా ప్రతికూరలో వేస్తాం. ఎందుకంటే ఇది కూర మంచి రంగులో రావడానికి, మంచి టేస్ట్ కావడానికి ఉపయోగిస్తాం. ఇంతేకాదు పసుపు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మసాలా దినుసుల్లో ఎన్నో రకాల పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

 దీన్ని గోల్డెన్ స్పైస్ అని కూడా అంటారు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే కర్కుమిన్ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.

 ఇతర ఆహారాలతో పాటుగా పసుపు కూడా కల్తీ అవుతోంది. అసలు మనం వాడే పసుపు అసలైన పసుపేనా? కాదా? అన్న సంగతి కూడా ఎవ్వరికీ తెలియదు. అందుకే మీరు వాడే పసుపు కల్తీ అయ్యిందా? కాదా? అన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

26
కల్తీ పసుపును ఉపయోగించడం వల్ల వచ్చే సమస్యలు

కల్తీ పసుపు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం.. సూడాన్ రెడ్ అనే రంగును పసుపులో కలిపి కల్తీ చేస్తున్నారు. ఈ రంగును ఎక్కువగా ప్లాస్టిక్, వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ దీనివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే కార్సినోజెనిక్ లక్షణాలు మనల్ని ప్రమాదకరమైన రోగాల బారిన పడేస్తాయి.

36
కల్తీ పసుపు

ఇది మాత్రమే కాదు పసుపులో మెటానిల్ ను కలిపి కల్తీ చేస్తున్నట్టు పలు అధ్యయనంలో వెల్లడైంది. ఈ రంగులు పసుపులో ఉండే పోషకాలను తగ్గించేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కల్తీ పసుపు వల్ల మనకు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.

46
కల్తీ పసుపును ఉపయోగించడం వల్ల వచ్చే సమస్యలు

కల్తీ పసుపును వాడటం వల్ల మూత్రపిండాల నష్టం కలుగుతుంది. అలాగే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. రక్తహీనత, నరాల నష్టం, కోలిక్ నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే పిల్లలలో అభివృద్ధి లేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

56
పసుపు స్వచ్ఛమైనదా? కల్తీ అయ్యిందా? ఇలా తెలుసుకోండి

టేస్ట్ చూడండి

స్వచ్ఛమైన పసుపును దాని రుచి ద్వారా గుర్తించొచ్చు. ఈ పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం వల్ల కొంచెం చేదు, మట్టి, ఘాటైన రుచి ఉంటుంది. మీరు వాడే పసుపు స్వచ్ఛమైనదా? లేదా? అని తెలుసుకోవడానికి చిటికెడు పసుపును నోట్లో వేసుకుని టేస్ట్ చేయండి. మీరు వాడేది స్వచ్ఛమైనదే అయితే కొంచెం చేదుగా ఉంటుంది. అదే కొంచెం తీయగా ఉంటే మాత్రం అందులో పిండి లేదా వేరే ఏదైనా కలిపి కల్తీ చేశారని అర్థం.

66
కాల్చి చూడండి

మీరు పసుపును కాల్చి కూడా స్వచ్ఛమైనదా? కల్తీ అయ్యిందా? అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం చిటికెడు పసుపు తీసుకుని దాన్ని కాల్చండి. ఇది కాలుతున్నప్పుడు చక్కెర కాల్చిన వాసన లేదా పగిలిన శబ్దాలు వినిపిస్తే మాత్రం అందులో బియ్యం పిండి వంటి వాటిని కలిపినట్టే.

యాసిడ్ టెస్ట్

యాసిడ్ టెస్ట్ తో కూడా మీరు ఈజీగా పసుపు కల్తీ అయ్యిందా? కాలేదా? అన్న సంగతిని తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఒక గ్లాస్ నీళ్లను తీసుకుని అందులో చిటికెడు పసుపును వేయండి. దీనిలో కొన్ని చుక్కల వెనిగర్ లేదా నిమ్మరసాన్ని వేయండి. ఈ సమయంలో గ్లాస్ నుంచి వింత శబ్దాలు, బుడగలు వస్తే మాత్రం అందులో ఖచ్చితంగా చాక్ పౌడర్ ను కలిపి కల్తీ చేసినట్టే.

Read more Photos on
click me!

Recommended Stories