ఎండాకాలంలో ఈ ఆహారాలు ఎండకంటే డేంజర్.. తిన్నారో..!

First Published | May 15, 2023, 3:50 PM IST

మొటిమలు చాలా మందికి అవుతుంటాయి. ఇది సాధారణ చర్మ సమస్య. మొటిమలు ఎండాకాలంలో ఇంకా ఎక్కువగా అవుతుంటాయి. ఎండాకాలంలో కొన్ని రకాల ఆహారాలను తింటేకూడా చర్మ సమస్యలు ఎక్కువగా అవుతాయి తెలుసా? 

ఎండాకాలంలో మామిడిపండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ సీజన్ దాటితే మళ్లీ ఈ పండ్లను తినడానికి వచ్చే ఎండాకాలం వరకు వెయిట్ చేయాలి. అందుకే చాలా మంది మామిడి పండ్లను మోతాదుకు మించి తింటుంటారు. కానీ ఇవి మన చర్మానికి అస్సలు మంచివి కావు. ఇవే కావు ఎండకాలంలో కొన్ని ఆహారాలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇవి మొటిమలను కలిగించడమే కాకుండా ఎన్నో చర్మ సమస్యలకు దారితీస్తాయి. ఇంతకీ ఎండాకాలంలో ఎలాంటి వాటిని తనకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image: Getty


మామిడి పండ్లు

ఎండాకాలం మామిడి పండ్ల సీజన్. ఈ సీజన్ దాటితే మామిడి పండ్లు దొరకవు. నిజానికి మామిడి పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ వీటిని అతిగా అస్సలు తినకూడదు. ఎందుకంటే మామిడి పండ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిని అతిగా తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, సెబమ్ ఉత్పత్తి పెరుగుతుంది.సెబమ్ జిడ్డుగల పదార్థం. ఇది చర్మ రంధ్రాలను అడ్డుకుంటుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది. అందుకే మామిడి వంటి ఎక్కువ చక్కెర ఉన్న పండ్లను తక్కువగా తినాలి. అప్పుడే మొటిమలు రావు.
 


జంక్ ఫుడ్స్, అధిక గ్లైసెమిక్ ఆహారాలు

చక్కెర స్నాక్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతాయి. అలాగే మొటిమలకు కారణమవుతాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్ 1 (ఐజిఎఫ్ -1) ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదంతో ముడిపడి ఉంది.అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ  లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. తక్కువ గ్లైసెమిక్ ఆహారం మీకున్న మొటిమలను తగ్గిస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఆహారాలలో తాజా కూరగాయలు, తాజా పండ్లు, బీన్స్ ఉన్నాయి. 
 

Image: Getty Images

చాక్లెట్లు, పాలు

పాలు ముఖ్యంగా స్కిమ్డ్ లేదా తక్కువ కొవ్వు, ఎక్కువ చక్కెర, పాలవిరుగుడు వంటి ప్రోటీన్ ఎక్కువున్నవి మొటిమల సమస్యలను పెంచుతాయి. పాలవిరుగుడులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మొటిమలను కలిగిస్తుంది. అలాగే చాక్లెట్లను ఎంత ఎక్కువగా తింటే షుగర్ కంటెంట్, హార్మోన్ల అసమతుల్యత వల్ల మొటిమలు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మొటిమలను నివారించడానికి చాక్లెట్లు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది. 
 

ఎక్కువ కార్బ్ డైట్

కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం ముఖ్యంగా తెల్ల రొట్టె, పాస్తా, చక్కెర స్నాక్స్ వంటి శుద్ధి చేసిన పిండి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి కారణమవుతాయి. శరీరంలో ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్ 1 (ఐజిఎఫ్ -1) ఉత్పత్తిని పెంచుతాయి. ఇది హార్మోన్ల అసమతుల్యత,  ఎక్కువ సెబమ్ ఉత్పత్తికి కారణమవుతుంది. ఇది మొటిమలకు కారణమవుతుంది. సాధారణంగా ప్రోటీన్, పిండి లేని కూరగాయలలో ఎక్కువగా ఉండే తక్కువ కార్బ్ ఆహారం శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని తేలింది. చర్మ వృద్ధాప్యాన్ని కూడా తగ్గిస్తుంది. 
 

fiber

తక్కువ ఫైబర్ ఫుడ్స్

చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రాసెస్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలు వంటి తక్కువ ఫైబర్ ఆహారాలను తినకూడదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అలాగే గట్ మైక్రోబయోమ్ కు అంతరాయం కలిగిస్తాయి. ఇది మంట, మొటిమలకు కారణమవుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలి. మొటిమలను తగ్గించడానికి ఆకుకూరలు, పండ్లు, చిక్కుళ్ళు, గింజలు వంటి ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాన్ని తినండి. 

Latest Videos

click me!