విటమిన్ డి తక్కువైతే ఎన్నో రోగాలొస్తయ్.. అందుకే వీటిని బాగా తినండి

First Published | May 12, 2023, 4:22 PM IST

విటమిన్ డి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రోగాలను తిప్పి కొడుతుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇది గనుక తగ్గితే లేని పోని రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. 
 

మీరు తినే ఆహారంలో విటమిన్ డి పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే  ఇది ఆరోగ్యకరమైన కణాలను పెంచడానికి, అనారోగ్యాన్ని నివారించడానికి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, కాల్షియం శోషణకు సహాయపడటానికి ఈ పోషకం చాలా అవసరం. విటమిన్ డి మీ ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇది పిల్లలలో ఎముక వ్యాధిని నివారించడానికి సహాయపడుతుంది. కాల్షియంతో పాటుగా విటమిన్ డి లోపం పెద్దలలో బోలు ఎముకల వ్యాధి బారిన పడేస్తుంది. ఈ విటమిన్ డి ఈ వ్యాధి నుంచి మనల్ని రక్షిస్తుంది.

మన శరీరంలో ఉండే మొత్తం విటమిన్ డిలో ఆహారం కేవలం 10% మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ తగినంత సూర్యరశ్మి పొందని లేదా ముదురు చర్మం ఉన్నవారు విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలపై ఆధారపడొచ్చు. విటమిన్ డి ఎక్కువగా ఉండే  ఆహారాలు ఏంటంటే..
 


mushrooms

పుట్టగొడుగులు

పుట్టగొడుగులు ప్రపంచవ్యాప్తంగా లభిస్తాయి. ఎండలో ఎండిన పుట్టగొడుగులు విటమిన్ డి కి అద్భుతమైన మూలం. చాలా పుట్టగొడుగులలో సహజంగా ఈ విటమిన్ ఉండదు. పుట్టగొడుగులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఔషధ ప్రయోజనం కోసం కూడా ఉపయోగిస్తారు. 

Image: Getty Images

సాల్మన్

సాల్మన్ అధిక-నాణ్యత లీన్ ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. అంతేకాకుండా ఇందులో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. కానీ అడవి సాల్మన్ మన శరీరం విటమిన్ అవసరాల రోజువారీ విలువలో 160% వరకు తీర్చగలదు. సాల్మన్ లో గుండెకు మేలు చేసే ఒమేగా, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.
 


కాడ్ లివర్ ఆయిల్

కాడ్ లివర్ ఆయిల్ ఒక ప్రసిద్ధ సప్లిమెంట్. విటమిన్ డి లోపానికి చికిత్స చేయడానికి దీనిని ఎన్నో ఏండ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇది రికెట్స్, సోరియాసిస్, క్షయ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఈ నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. 

గుడ్లు

గుడ్లు సంపూర్ణ ఆహారం. గుడ్లలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తింటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అందుకే వీటిని ఉదయం ఖచ్చితంగా తినాలంటరు ఆరోగ్య నిపుణులు. గుడ్డులోని పచ్చసొన విటమిన్ డి కి మంచి వనరు. ఒక గుడ్డులో 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. రోజూ ఒక గుడ్డును తింటే ఎలాంటి సమస్యలు రావు.  అందుకే ప్రతి ఇంటిలో తప్పనిసరిగా అల్పాహారంగా దీన్ని తీసుకోవాలి. దీనిలో వివిధ ఖనిజాలు , విటమిన్లు ఉంటాయి.

Soy Milk

సోయా పాలు

సోయా మిల్క్ అనేది మొక్కల ఆధారిత పాల. ఇవి పొడి సోయాబీన్లను నానబెట్టి, వాటిని రుబ్బడం ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఇది సాధారణ ఆవు పాల మాదిరిగానే ప్రోటీన్ ను కలిగి ఉన్నప్పటికీ దీనిలో విటమిన్ డి, విటమిన్ సి, ఇనుము పుష్కలంగా ఉంటాయి. 

Latest Videos

click me!