Pumpkin seeds
గుమ్మడికాయ విత్తనాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. గుండె నుంచి కంటికి, జుట్టు నుంచి డయాబెటిస్ వరకు ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ విత్తనాలను ఎన్నో విధాలుగా తినొచ్చు. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. గుమ్మడికాయ విత్తనాలు చూడటానికి చిన్నగా ఉన్నా.. వీటిలో విలువైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని విత్తనాలను తిన్నా బోలెడు లాభాలను పొందుతారు. అవేంటంటే..
మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది
మెగ్నీషియం ఉత్తమ వనరులలో గుమ్మడి గింజలు ఒకటి. మీ రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు మెగ్నీషియం బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుండె, ఎముక ఆరోగ్యానికి కూడా మెగ్నీషియం స్థాయిలు చాలా చాలా అవసరం.
Image: Getty Images
యాంటిడిప్రెసెంట్
ట్రిప్టోఫాన్ గుమ్మడికాయ విత్తనంలో ఉన్న ఒక ముఖ్యమైన అమైనో ఆమ్లం. అలాగే 5-హైడ్రాక్సీట్రిప్టోఫాన్ (5-హెచ్టిపి) ట్రిప్టోఫాన్ కూడా దీనిలో ఉంటాయి. ట్రిప్టోఫాన్, 5-హెచ్టిపి రెండూ నిరాశకు తగ్గించడానికి సహాయపడతాయి. గుమ్మడికాయ విత్తనాల ఎల్-ట్రిప్టోఫాన్ కంటెంట్ నిరాశను, ఒత్తిడిని పోగొట్టడానికి సహాయపడుతుంది.
షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది
గుమ్మడికాయ విత్తనాలలో ఎక్కువ మొత్తంలో ఫినోలిక్ యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో ట్రైగోనెల్లిన్, డి-చిరో-ఇనోసిటాల్, నికోటినిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇది రక్తంలో ఇనుము స్థాయిలను కూడా పెంచుతుంది
జుట్టు పెరుగుదలకు
గుమ్మడి విత్తనాలు జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరిగేందుకు కూడా సహాయపడతాయి. గుమ్మడికాయ విత్తనాలలో ఉండే ఫైటోస్టెరాల్స్ సంభావ్య ప్రభావాలే దీనికి కారణం. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
జింక్
గుమ్మడికాయ విత్తనాలలో పోషకాలు.. ముఖ్యంగా జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యకరమైన పనితీరుకు, చర్మ పనితీరుకు, రోగనిరోధక వ్యవస్థ రక్షకుడిగా చేస్తుంది. గుమ్మడికాయ విత్తనాలలో అధిక జింక్ కంటెంట్ పురుషులలో స్పెర్మ్ నాణ్యతను, సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
మీ రోజువారీ ఆహారంలో గుమ్మడికాయ విత్తనాలను ఎలా చేర్చాలి?
వీటిని స్మూతీలు, పెరుగు, పండ్లలో కలపాలి.
సలాడ్లు, సూప్లు లేదా తృణధాన్యాలుగా చల్లి గార్నిష్ చేయండి