తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

Kitchen tips: ఐరన్ పాత్రల్లో ఈ కూరలను అస్సలు వండకూడదు తెలుసా?

Kavitha G | Published : Feb 14, 2025 2:02 PM

చాలామంది కిచెన్ లో ఐరన్ పాత్రలను వాడుతుంటారు. వాటిలో వంటచేస్తే రుచి బాగుంటుంది. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నమ్ముతుంటారు. అయితే ఐరన్ కడాయిల్లో కొన్ని వంటలు చేయడం అస్సలు మంచిది కాదట. మరి ఏ ఆహారాలను ఈ పాత్రల్లో వండకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

15
Kitchen tips: ఐరన్ పాత్రల్లో ఈ కూరలను అస్సలు  వండకూడదు తెలుసా?

వంట కోసం మనం అనేక రకాల పాత్రలను వాడుతుంటాం. చాలా మంది ఇప్పటికీ వంట కోసం ఐరన్ కడాయిలను వాడుతుంటారు. శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు ఈ పాత్రలలో వంట చేసుకొని తినాలని అంటూ ఉంటారు. దీనివల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఐరన్ పాత్రలలో వండిన ఆహారం తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. అయితే, అన్ని రకాల ఆహారాన్ని ఐరన్ పాత్రల్లో వండకూడదట. ఇంతకీ ఏ ఆహారాలు వండకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

25
గుడ్లు :

ఐరన్ కడాయిలో గుడ్లు వండేటప్పుడు అవి కడాయికి అంటుకుపోతాయి. గుడ్డు టేస్ట్ కూడా మారుతుంది. అందుకే గుడ్లను ఈ కడాయిల్లో వండకూడదు అంటారు.  

35
టమాటా:

టమాటాలో ఆమ్లత్వం ఎక్కువగా ఉండటం వల్ల, కడాయిలోని ఇనుము ఆహారంతో చర్య జరిపి రుచిని మారుస్తుంది. ఇది శరీరంలో కొన్ని సమస్యలకు దారితీస్తుంది. అందుకే టమాటాలను ఐరన్ కడాయిలో వండకూడదు.

45
పాల ఉత్పత్తులు

పన్నీర్ లాంటి పాల ఉత్పత్తులను ఐరన్ ప్యాన్‌లో వండేటప్పుడు అవి విరిగిపోతాయి. ఇది రుచిని కూడా మారుస్తుంది. ఈ పాత్రలో వండిన పాల ఉత్పత్తులను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

55
చేప :

చేప మెత్తగా ఉంటుంది. ఇది కడాయికి అంటుకుపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా, దీన్ని కడాయిలో వండడం వల్ల అది విరిగిపోతుంది. కాబట్టి ఐరన్ కడాయిలో చేపలను ఎప్పుడూ వండకూడదు.

Read more Photos on
click me!
Recommended Photos