Turmeric: కూరలో పసుపు ఎక్కువ అయితే ఏమౌతుంది?

Published : Feb 14, 2025, 11:34 AM IST

ప్రయోజనాలు ఉన్నా కూడా పసుపు ఎక్కువగా తీసుకోకూడదట. కూరల్లో పసుపు ఎక్కువగా వేసి తింటే ఏమౌతుందో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..  

PREV
15
Turmeric: కూరలో పసుపు ఎక్కువ అయితే ఏమౌతుంది?

భారతీయ వంటకాల్లో పసుపు కు చాలా ప్రాధాన్యత ఉంది. చాలా రకాల సంప్రదాయ వంటల్లో కచ్చితంగా పసుపు వేస్తూ ఉంటారు. అసలు.. కూరల్లో పసుపు వేయకుండా.. తినకూడదు అని కూడా పెద్దలు చెబుతుంటారు. పసుపులో చాలా మంచి గుణాలు ఉన్నాయి. యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి.  ఇన్ని ఔషధ గుణాలు ఉండటం వల్ల  దీనిని వంటలో భాగం చేసుకోవాలని  అంటూ ఉంటారు. అయితే..  ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా పసుపు ఎక్కువగా తీసుకోకూడదట. కూరల్లో పసుపు ఎక్కువగా వేసి తింటే ఏమౌతుందో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

25
turmeric powder

రక్తంలో షుగర్ లెవల్స్...
కూరల్లో ఎక్కువ పసుపు వేసుకొని తినడం వల్ల  రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇది టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా  ఉండొచ్చు. కానీ, ఇది ఇతరులకు ఆరోగ్య సమస్యలను  తెచ్చి పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. వీలైనంత వరకు పసుపు మరీ ఎక్కువగా వాడకపోవడమే మంచిది.

35

కిడ్నీ సమస్య
పసుపులో ఆక్సలేట్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. మీరు ఎక్కువగా పసుపు తిన్నప్పుడు, ఆక్సలేట్ సమ్మేళనం మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది. అందుకే ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువగా తినకూడదు.  అంతేకాదు.. పసుపులో కర్కుమిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది, ఇది శరీరం  ఐరన్ గ్రహించకుండా నిరోధిస్తుంది. ఎక్కువగా పసుపు తీసుకోవడం వల్ల  ఐరన్ లోపం అనీమియా వస్తుంది. అంటే రక్త హీనత చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

45

జీర్ణ సమస్యలు.. 
ఆహారాలలో ఎక్కువగా పసుపు పొడిని జోడించడం వల్ల విరేచనాలు, అజీర్ణం, గుండెల్లో మంట, మలబద్ధకం, గ్యాస్, వికారం వంటి జీర్ణ రుగ్మతలు వస్తాయి.
కాలేయం దెబ్బతింటుంది అధికంగా పసుపు తినడం వల్ల కాలేయంపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది, ఇది కాలేయంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. పసుపు చర్మానికి అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, దానిలో ఉండే కర్కుమిన్ చర్మంపై ప్రతికూల ప్రతిచర్యలకు కారణమవుతుంది.
 

55

మరి, పసుపు వంటకు ఎంత  వాడాలి..?
రోజుకు 3 గ్రాముల వరకు పసుపు తీసుకోవడం సురక్షితమైనదిగా పరిగణిస్తారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు , మందులు తీసుకునేవారు వైద్యుడి సలహా మేరకు మాత్రమే పసుపును తీసుకోవాలి.

click me!

Recommended Stories