Almonds : బాదంతో పాటు ఇవి తింటే ఎంత డేంజరో తెలుసా?

Published : Feb 13, 2025, 07:59 PM IST

Almonds : మన ఆరోగ్యానికి బాదం చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలు ఉంటాయి. కాని బాదం పప్పులను కొన్నింటితో కలిపి తింటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
Almonds : బాదంతో పాటు ఇవి తింటే ఎంత డేంజరో తెలుసా?

బాదం ను ఏ వయసు వారేనా తినొచ్చు. వీటిని పచ్చిగా లేదా నానబెట్టి తినొచ్చు. కొంతమంది బాదం పాలుగాను, మరికొందరు స్వీట్స్ లో వేసుకొని తింటారు. బాదం ఎలా తిన్నా ఆరోగ్యానికి మంచిదే.. కాని కొన్ని ఆహారాలతో కలిపి తినకూడదని నిపుణులు అంటున్నారు. అలా చేస్తే జీర్ణ సమస్యలు వస్తాయి. ఎలాంటి ఆహారాలతో బాదం కలిపి తినకూడదో తెలుసుకుందాం.

25

సిట్రస్ పండ్లతో కలిపి తినొద్దు

ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో అధిక ఆమ్లాలు ఉంటాయి. బాదంలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తింటే అది జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్, వాపు, కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది బాదంలో ఉండే కాల్షియంతో కలవదు. మీరు ఈ రెండింటినీ తినాలనుకుంటే కాస్త గ్యాప్ ఇచ్చి తినడం బెటర్. 

35

పాల ఉత్పత్తులతో వద్దు

మీకు తెలుసా బాదంను ఎప్పుడూ కాఫీ, టీ లేదా పెరుగుతో కలిపి తినకూడదు. కాని చాలా మంది ఇదే పనిచేస్తారు. అందుకే జీర్ణ సమస్యలు వస్తాయి. పాల ఉత్పత్తులలో కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది బాదంలో ఉండే ఇనుము, మెగ్నీషియంలతో కలవదు. ఆయుర్వేదం ప్రకారం, బాదంను పాల ఉత్పత్తులతో  కలిపి తింటే శ్లేష్మం పెరుగుతుంది. అలాగే సోయా ఉత్పత్తులతో కూడా బాదం కలిపి తినకూడదని డాక్టర్లు చెబుతారు. 

45

దుంపలతో కూడా కలిపి తినొద్దు

బాదంలో సహజంగానే ఆక్సలేట్ ఉంటుంది. కాబట్టి బీట్రూట్, బంగాళాదుంప, పాలకూర వంటి ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలతో బాదం తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటే అది కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్ కిడ్నీ రాళ్లను ఏర్పరుస్తుంది. కాబట్టి మీరు బాదం తినాలనుకుంటే దుంపలతో కలిపి తినకండి.

 

55

చిప్స్ తో కలిపి తింటే డేంజరే..

చిప్స్, బఠానీలు వంటి అధిక ఉప్పు ఉన్న ఆహారాలతో బాదం కలిపి తినకూడదు. అలా తినడానికి బాగున్నా ఆరోగ్యానికి చాలా డేంజర్. ఉప్పులో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇది కాకుండా వాపును కూడా కలిగిస్తుంది. కాబట్టి ఉప్పు లేని ఆహారాలతో మాత్రమే బాదం తినాలి.

Read more Photos on
click me!

Recommended Stories