జీడి పండులో విటమిన్ సి అధికంగా స్థాయిలో ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. కాలం మారినప్పుడల్లా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి. అలాంటి సమస్యల నుంచి రక్షణ పొందడానికి విటమిన్ సి అవసరం పడుతుంది. కాబట్టి జీడి పండును తినడం వల్ల విటమిన్ సి శరీరానికి అవసరమైనంత ఆహారాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ పండును అధికంగా తీసుకుంటే ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారికి జీడి పండు ఉపయోగకరంగా ఉంటుంది. జీడి మామిడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ పొట్ట పనితీరును మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయిపోతుంది కాబట్టి పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావు. మలబద్ధకం సమస్య కూడ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పండును తిన్న తర్వాత కడుపు తేలికగా ఉన్నట్టు అనిపిస్తుంది.