Curd: ఎండాకాలంలో రోజూ పెరుగు తినొచ్చా?
ఎండాకాలంలో పెరుగు తినడం చాలా మంచిది అని చాలా మంది చెబుతారు. కానీ, రోజూ పెరుగు తింటే సమస్యలు కూడా వస్తాయని మీకు తెలుసా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
ఎండాకాలంలో పెరుగు తినడం చాలా మంచిది అని చాలా మంది చెబుతారు. కానీ, రోజూ పెరుగు తింటే సమస్యలు కూడా వస్తాయని మీకు తెలుసా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
Curd in Summer: ఎండాాకాలంలో కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ లో పెరుగు ముందు వరసలో ఉంటుంది. సమ్మర్ లో పెరుగు తింటే.. వేడి చేయకుండా ఉంటుందని, చలవ చేస్తుందని ఇంట్లో పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. అంతేకాదు, పెరుగులో మన శరీరానికి అవసరం అయ్యే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రో బయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తాయి. ఎన్నో ప్రయోజనాలు ఉన్నా కూడా ఈ సమ్మర్ లో పెరుగు ఎక్కువగా తినకూడదని మీకు తెలుసా? తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో, నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
ఎండాకాలంలో పెరుగు తింటే ఏమవుతుంది?
ఎండాకాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పెరుగు కడుపుని ఆరోగ్యంగా, చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి వంటి పోషకాలు పెరుగులో ఉన్నాయి. కానీ, ఎండాకాలంలో కొందరికి పెరుగు తింటే చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు, మొటిమలు, వేడి చేయడం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకో తెలుసా?
ఎండాకాలంలో రోజూ ఎందుకు పెరుగు తినకూడదు?
ఎండాకాలంలో వేడి నుంచి తప్పించుకోవడానికి చాలామంది రోజూ పెరుగు తింటారు. ఎందుకంటే పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచుతుందని నమ్ముతారు. కానీ నిజానికి అది నిజం కాదు. ఎందుకంటే అందులో వేడిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ అదే నిజం. ఆయుర్వేదం ప్రకారం ఎండాకాలంలో పెరుగు తినడం వల్ల మంచి, చెడు ఫలితాలు ఉంటాయి. ఇది వాత, పిత్త, కఫాలను బట్టి మారుతుంది.
ఎండాకాలంలో పెరుగు తింటే వేడి ఎందుకు చేస్తుంది?
పెరుగులో ఉండే చల్లదనం శరీరాన్ని చల్లగా ఉంచుతుందని మనం అనుకుంటాం. అందుకే ఎండాకాలంలో రోజూ పెరుగు తింటాం. కానీ నిజానికి పెరుగులో ఉండే పుల్లటి రుచి వేడిని పెంచుతుంది. ఇది మనకు తెలిసే ఉండదు. అందుకే పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
పెరుగు తింటే మొటిమలు ఎందుకు వస్తాయి?
పెరుగులో వాతం తక్కువగా, పిత్తం, కఫం ఎక్కువగా ఉండటం వల్ల ఎండాకాలంలో పెరుగు తిన్నప్పుడు వేడి చేస్తుంది. అంతేకాకుండా పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచుతుందని కొందరు ఎక్కువగా తింటారు. దీనివల్లే వారికి మొటిమలు, ఇతర సమస్యలు వస్తాయి.
ఎండాకాలంలో పెరుగుని ఎలా తినాలి?
ఎండాకాలంలో మీరు రోజూ పెరుగు తినడానికి బదులుగా మజ్జిగలా తాగొచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదు. ముఖ్యంగా మజ్జిగలో కొద్దిగా మిరియాలు, జీలకర్ర, ఉప్పు కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలంలో మజ్జిగ ఎందుకు తాగాలి అంటే పెరుగులో నీళ్లు కలిపినప్పుడు అందులో ఉండే వేడి తగ్గుతుంది, చల్లదనం పెరుగుతుంది. కాబట్టి మీరు ఎండాకాలంలో రోజూ మజ్జిగ తాగినా ఎలాంటి సమస్య ఉండదు. అది మీ శరీరాన్ని ఆరోగ్యంగా, చల్లగా ఉంచుతుంది.
పెరుగుతో వేరే పండ్లను కలిపి తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే పెరుగుని ఎప్పుడూ వేడి చేయకూడదు. బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు పెరుగు తినకపోవడమే మంచిది.