ఎండాకాలంలో పెరుగు అన్నాన్ని తింటే..!

First Published | May 26, 2023, 4:26 PM IST

పొట్టకు సంబంధించిన ఎన్నో సమస్యలను తగ్గించడానికి పెరుగు అన్నం ఎంతో సహాయపడుతుంది. ఎండాకాలంలో పెరుగు అన్నాన్ని తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Curd rice

పెరుగు అన్నాన్ని ఇష్టంగా తినేవారు చాలా మందే ఉన్నారు. ఇది సౌత్ ఇండియన్ డిష్. ఎండాకాలంలో ఈ వంటకాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  వాస్తవానికి పెరుగులో విటమిన్ సి, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. బియ్యంలో ఎక్కువ మొత్తంలో పిండి పదార్ధాలు ఉంటాయి. కానీ పాత బియ్యాన్ని పెరుగు అన్నంలో ఉపయోగిస్తారు. దీని వల్ల ఇది ప్రోబయోటిక్ గా మారుతుంది. ఇది మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా తయారుచేయాలి? దీన్ని తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Curd rice

పెరుగు అన్నాన్ని ఎలా తయారుచేయాలి?

పెరుగు అన్నాన్ని తయారు చేయాలంటే ముందుగా అన్నాన్ని రాత్రంతా నానబెట్టండి. తర్వాత ఉదయాన్నే ఈ అన్నాన్ని పెరుగులో కలపండి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసి పోపు పెట్టండి.  కొద్దిగా కొత్తిమీర లేదా ఉప్పు వేసి ఈ అన్నాన్ని తినండి. పెరుగు అన్నాన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..
 

Latest Videos


Curd rice

ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి

పెరుగు అన్నంలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపునకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ అన్నం మీ గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. అలాగే ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
 

Curd Rice

చల్లదనం

పెరుగు అన్నం కడుపులో కూలింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల ఎండాకాలంలో కడుపునొప్పి, అజీర్ణం నుంచి ఉపశమనం పొందుతారు. దీనితో పాటుగా ఇది బరువు తగ్గేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన శరీర శక్తిని పెంచుతుంది. అలాగే మీరు ఆరోగ్యంగా, ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. 
 

Curd rice

ఎసిడిటీ, ఉబ్బరం కోసం ప్రయోజనకరంగా ఉంటుంది

ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నవారికి పెరుగు అన్నం తినడం చాలా మంచిది. ఇది త్వరగా జీర్ణమవుతుంది. ఆమ్ల పిత్త రసం ఎక్కువగా ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. దీనివల్ల ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు రావు. కాబట్టి ఎండాకాలంలో తరచుగా పెరుగు అన్నాన్ని తింటూ ఉండండి.  

click me!