1.పండ్లు...
చాలా మందికి పెరుగు అన్నంలో పండ్లు తినే అలవాటు ఉంటుంది. కానీ.. ఇలా తినకూడదు. ఇలా పెరుగుతో కలిపి పండ్లు తినడం అందరికీ సెట్ అవ్వదు. ముఖ్యంగా నారింజ, పైనాపిల్, మామిడి పండ్లు పెరుగుతో కలిపి అస్సలు తినకూడదు. ఇలా తినడం వల్ల గ్యాస్, మలబద్దకం, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
2.చేపలు, మాంసాహారం...
చేపలు లేదా మాంసాహారంతో పెరుగు కలిపి తినడం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం, పెరుగులో వీటిని కలిపి తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ విడుదలయ్యే ప్రమాదం ఉంది. దీని వల్ల అలర్జీలు, దురద వంటి చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.