గేదె పాలలో కాల్షియం కంటెంట్ పుష్కలంగా ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. 250 మిల్లీ లీటర్ల గేదె పాలు 412 మిల్లి గ్రాముల కాల్షియంను అందిస్తాయి. ఇందులో ఫాస్పరస్, మెగ్నీషియం, క్లోరైడ్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ఇందులోని కొవ్వు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.