మనం రోజూ తినే ఫుడ్స్.. ఏది ఎక్కువ కాలరీలు ఉంటాయె తెలుసా?

First Published | Feb 22, 2024, 4:34 PM IST

దీనికి ఎన్ని  క్యాలరీలుు ఉంటాయి అనే విషయం తెలిస్తే ఏం తినాలనే భయం ఉండదు. అందుకే.. ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీలు ఉంటాయో ఇప్పుడు  చూద్దాం..
 

మనం ఉదయం లేవగానే కమ్మగా బ్రేక్ ఫాస్ట్ చేస్తాం.  మన తెలుగువాళ్లం ఎక్కువగా ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరీ వంటివి తింటూ ఉంటాం. ఇక, బరువు తగ్గాలి అనుకునేవారు.. ఏది తింటే బరువు పెరుగుతామా అనే భయంతో కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. అయితే దీనికి ఎన్ని  క్యాలరీలుు ఉంటాయి అనే విషయం తెలిస్తే ఏం తినాలనే భయం ఉండదు. అందుకే.. ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీలు ఉంటాయో ఇప్పుడు  చూద్దాం..


1.దోశ...
దోశను మనం  మినపప్పు, రైస్ కాంబినేషన్ తో చేస్తాం. కాగా.. ఒక్క దోశలో 168 కేలరీలు ఉంటాయి. దాదాపు మనం కొబ్బరి చట్నీ తో తింటాం. చట్నీతో కలుపుకొనే 168 క్యాలరీలు ఉంటాయి.
 

Latest Videos


idli

2.ఇఢ్లీ..
దాదాపు అందరు ఇళ్లలో కామన్ గా చేసుకునే బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ. దీనిని కూడా మనం మినపప్పు, రవ్వతోతయారు చేసుకుంటాం. కొందరు పెసరప్పు వాడతారు. కొందరు రవ్వకు బదులుగా బియ్యం వాడతారు. ఎలా చేసినా ఒక్కో ఇడ్లీలో 39 క్యాలరీలు ఉంటాయి.

Poha

3.పోహ..
దీనినే మనం అటుకుల ఉప్మా అని కూడా పిలుస్తాం. పోహ తయారీలో మనం అటుకులు, పల్లీలు, కరివేపాకు, కొంచెం నూనె లాంటివి వాడతాం. అసవరం అయితే నిమ్మరసం కూడా పిండుకుంటాం. ఇవన్నీ కలిపి ఒక చిన్న గిన్నె పోహలో 250 క్యాలరీలు ఉంటాయి.

4.పరాటా..
మనలో చాలా మందికి పరోటా అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉండి ఉంటుంది. ఎక్కువ నెయ్యి వేసి మరీ చేస్తారు. కాబట్టి.. ఒక పరాటాలో 250 క్యాలరీలు ఉంటాయి. అదే.. ఆలూ పరాటా అయితే... 300 క్యాలరీల దాకా ఉంటాయి.
 

5.పూరీ..
చాలా మంది ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్ లలో పూరీ ముందు వరసలో ఉంటుంది. ఒక ప్లేట్ కి రెండు పూరీలు ఇస్తారు. అంటే.. ఒక ప్లేట్ పూరీ, విత్ కర్రీ కలిపి దాదాపు 700 క్యాలరీ ఉంటాయి. న్యూట్రిషన్స్ నిపుణుల ప్రకారం 350 క్యాలరీల కన్నా ఎక్కువగా ఉండే ఫుడ్ ఏదైనా ఫ్యాట్ గా మారే ప్రమాదం ఉంది.
 

Pesarattu Dosa

6.పెసరట్టు..
పెసరట్టును చాలా హెల్దీ బ్రేక్ ఫాస్ట్ గా చెబుతూ ఉంటారు. ఒక పెసరట్టులో 236 క్యాలరీలు ఉంటాయి.  ఇది తయారు చేయడం చాలా సులభం. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

7.ఉతప్పం..
దోశ లాగానే చేస్తారు కానీ.. కొంచెం మందంగా చేస్తారు. సేమ్ చేయడం కూడా దోశలాగానే చేస్తారరు. అదనంగా ఉల్లిపాయ, క్యారెట్ వంటి కూరగాయలు కలుపుతారు.  ఒక ఉతప్పంలో 258 క్యాలరీలు ఉంటాయి.
 

Upma

8. ఉప్మా..
మన ఇళ్లల్లో కామన్ గా చేసే మరో బ్రేక్ ఫాస్ట్ ఉప్మా.  100 గ్రాముల ఉప్మాలో 209  కేలరీలు ఉంటాయి. ఇది తయారు చేయడం చాలా సింపుల్.  ఎక్కువ కూరగాయలు వేసుకొని తయారు చేసుకోవచ్చు.

click me!